How to Prepare Gongura Prawns Curry : చాలా మంది చేపల కూరను ఈజీగా వండేస్తారు. కానీ ప్రాన్స్(రొయ్యల) విషయానికొస్తే కాస్త వెనకడుగు వేస్తారు. మనవల్ల కాదులే అని కొందరు.. టేస్ట్ సరిగ్గా కుదరదని ఇంకొందరు భావిస్తుంటారు. అందుకే రొయ్యలతో వెరైటీ వంటలు ఉన్నా అవి చేయడం రాక.. ఏదో ఒక మసాలాలు వేసి మామూలు కూర చేస్తుంటారు. ఇకపై అలాంటి వారు, బ్యాచిలర్స్, మొదటిసారి చేసే వారు కూడా ఈ టిప్స్ ఫాలో అవుతూ చేస్తే.. పుల్ల పుల్లగా నోరూరించే గోంగూర రొయ్యల కర్రీని చాలా సింపుల్‌గా ఇంట్లోనే తయారుచేసుకోవచ్చు. మరి, లేట్ చేయకుండా ఈ కర్రీ చేయడానికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఏంటో చూసి.. ఇంట్లోనే ప్రిపేర్ చేసి లొట్టలేసుకుంటూ లాగించండి.
గోంగూర రొయ్యల కర్రీ ప్రిపేర్ చేయడానికి కావాల్సిన పదార్ధాలు :
- శుభ్రం చేసిన రొయ్యలు- పావు కేజీ
- నూనె- సరిపడినంత
- ఉప్పు - సరిపడినంత
- దాల్చిన చెక్క - కొద్దిగా
- లవంగాలు- 4
- యాలకులు-4
- బిర్యానీ ఆకు
- జీలకర్ర- టీస్పూన్
- కరివేపాకు రెమ్మలు-2
- పచ్చిమిర్చి -4
- ఉల్లిపాయలు-2 (సన్నగా కట్ చేసుకోవాలి)
- అల్లం వెల్లులి పేస్ట్- టేబుల్ స్పూన్
- టమాటలు- ఒకటి
- పసుపు- టీస్పూన్
- కారం- రుచికి సరిపడా
- ధనియాల పొడి- టీస్పూన్
- వేయించిన జీలకర్ర పొడి- టీస్పూన్
- గరం మసాలా-టీస్పూన్
- గోంగూర ఆకులు- పావు కేజీ
- నీళ్లు- సరిపడినన్నీ
- కొత్తిమీర తరుగు - కొద్దిగా
సండే స్పెషల్ : రొయ్యలతో ఈ వెరైటీలు - వహ్వా అనాల్సిందే!
గోంగూర రొయ్యల కర్రీ తయారీ విధానం :
- ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి.. వేడెక్కాక పచ్చి రొయ్యలు, కొద్దిగా ఉప్పు, పసుపు వేసి రొయ్యలలో నీరు పోయేదాకా ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి.
- ఆ తర్వాత ఇదే పాన్‌లో ఇంకా కొద్దిగా ఆయిల్ వేసి.. దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, బిర్యానీ ఆకు, జీలకర్ర వేసి వేయించుకోవాలి.
- ఇప్పుడు పచ్చిమిర్చి, కొద్దిగా ఉప్పు, ఉల్లిపాయ ముక్కలను వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి.
- అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాట ముక్కలను వేసి కలపండి. తర్వాత పసుపు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేయించుకోవాలి.
- ఆ తర్వాత కొన్ని నీళ్లు పోసి ఉడికించుకోవాలి. ఈ మిశ్రమంలోకి బాగా కడిగిన గోంగూర ఆకులు వేసి 5 నిమిషాలు ఉడికించండి.
- తర్వాత రొయ్యలను వేసి, కొన్ని నీళ్లు యాడ్ చేసుకుని 10 - 15 నిమిషాలు సన్నని మంట మీద ఉడికించుకోండి.
- ఇలా ఉడికించుకోవడం వల్ల రొయ్యలకు కారం, ఉప్పు, మసాలాల రుచి బాగా పడుతుంది.
- కర్రీని దింపేసుకునే ముందు కొద్దిగా సన్నని కొత్తిమీర తరుగు, కరివేపాకు, గరం మసాలా వేసుకుని కలుపుకుని పక్కన పెట్టుకుంటే.. ఎంతో రుచికరమైన గోంగూర రొయ్యల కర్రీ రెడీ.
- నచ్చితే మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేయండి. రైస్‌లోకి మాత్రమే కాదు.. చపాతీ, పరాటా.. ఇలా ఎందులోకైనా అద్దిరిపోద్ది.
prawns recipe : ఆహా..! ఏమి రుచి... అనరా మైమరచి..
సండే స్పెషల్ - "కాజు మష్రూమ్ మసాలా కర్రీ"- రైస్‌లోకి మాత్రమే కాదు చపాతీల్లోకి సూపర్ కాంబినేషన్!