తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మైనర్​ తల నరికి తీసుకెళ్లిపోయిన వరుడు- మ్యారేజ్ లేట్ అవుతుందనే కోపంతో! - Young Man Murdered Girl - YOUNG MAN MURDERED GIRL

Girl Murder In Karnataka : బాలికతో జరగాల్సిన వివాహం ఆలస్యం అవుతుందన్న కోపంతో ఆమెను పాశవికంగా హత్య చేశాడు ఓ యువకుడు. బాలిక తలను నరికి తనతో తీసుకెళ్లిపోయాడు. ఈ ఘటన కర్ణాటకలో జరిగింది.

Girl Murder
Girl Murder (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : May 10, 2024, 12:32 PM IST

Updated : May 10, 2024, 1:31 PM IST

Girl Murder In Karnataka :16 ఏళ్ల బాలికను దారుణంగా నరికి చంపి ఆమె తలను పట్టుకుని పరారయ్యాడు ఓ యువకుడు. ఈ ఘటన కర్ణాటక కొడుగు జిల్లాలోని సూర్లబ్బి గ్రామంలో గురువారం సాయంత్రం జరిగింది. నిందితుడు ప్రకాశ్ కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు.

అసలేం జరిగిందంటే?
ప్రకాశ్ అనే వ్యక్తికి మీనా(16)తో కొన్నాళ్ల క్రితం వివాహం నిశ్చయమైంది. ఈ నేపథ్యంలో ఇరువురి కుటుంబసభ్యుల సమక్షంలో ప్రకాశ్, మీనా నిశ్చితార్థం గురువారం జరిగింది. మీనా మైనర్ అని గుర్తు తెలియని వ్యక్తులెవరో చైల్డ్ హెల్ప్​లైన్​కు సమాచారం అందించారు. వెంటనే చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్​మెంట్ అధికారులు మీనా ఇంటికి చేరుకుని మైనర్​గా ఉన్న ఆమెకు పెళ్లి చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పోక్సో చట్టం, బాల్య వివాహ చట్టం కింద ఇరు కుటుంబాలపై కేసు నమోదు చేస్తామని చెప్పారు. ప్రకాశ్, మీనా కుటుంబ సభ్యులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. ఈ క్రమంలో మీనాకు 18 ఏళ్ల పూర్తయిన తర్వాత ప్రకాశ్​తో పెళ్లి చేయాలని ఇరు కుటుంబాలు అంగీకరించాయి. దీంతో అక్కడి నుంచి ప్రకాశ్ కుటుంబసభ్యులు, అధికారులు వెళ్లిపోయారు.

తల నరికేసిన నిందితుడు
కాగా, గురువారం సాయంత్రం 5.30 గంటల సమయంలో మీనా ఇంటికి ప్రకాశ్ వెళ్లాడు. మీనా తండ్రిని కొట్టాడు. ఆమె తల్లిపై పదునైన ఆయుధంతో దాడి చేశాడు. ఆ తర్వాత మీనాను దాదాపు 100 మీటర్ల మేర బయటికి ఈడ్చుకెళ్లి ఆమె తలను నరికాడు. మొండెన్ని అక్కడే వదిలేసి తలను తీసుకుని ప్రకాశ్ అక్కడి నుంచి పరారయ్యాడు. ప్రస్తుతం మృతురాలు తల్లి ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. నిందితుడిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామని పోలీసులు తెలిపారు. నిందితుడు ప్రకాశ్​పై ఐపీసీ 307(హత్యాయత్నం), 302(మర్డర్) సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని పేర్కొన్నారు.

ఎస్​ఎస్​ఎల్​సీ ఫలితాల్లో మంచి మార్కులు
మృతురాలికి ముగ్గురు సోదరీమణులు, ఇద్దరు సోదరులు ఉన్నారు. వారందరిలో మృతురాలే చిన్న అమ్మాయి. కాగా, గురువారం విడుదలైన ఎస్​ఎస్​ఎల్​సీ ఫలితాల్లో మృతురాలు మంచి మార్కులతో పాసైంది. అంతలోనే ఆమెను మృత్యువు కబళించింది.

తల్లిని కొట్టిచంపిన కుమారుడు!- శిక్షగా 6 నెలల సమాజ సేవ- హైకోర్టు కీలక తీర్పు - HC Orders To Do Community Service

'నా గర్ల్​ఫ్రెండ్ బర్గర్​ తింటావా?'- ఫ్రెండ్​ను కాల్చి చంపిన యువకుడు - Kills Friend For Burger Bite

Last Updated : May 10, 2024, 1:31 PM IST

ABOUT THE AUTHOR

...view details