తెలంగాణ

telangana

ETV Bharat / bharat

బంగాల్‌ డాక్టర్‌ హత్యాచార ఘటన- అవన్నీ జరగలేదట! కోల్​కతా పోలీసుల సంచలన ఫ్యాక్ట్​చెక్! - Kolkata Doctor Murder Case

Kolkata Doctor Murder Case : దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్న బంగాల్‌లోని జూనియర్‌ డాక్టర్‌ ఉందంతంపై పలు తప్పుడు వార్తలు ప్రచారంలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఆర్జీ కార్‌ ఆస్పత్రిలో జరిగిన దారుణంలో మృతి చెందిన ఆ మహిళ ఎముకలు విరిగినట్లు, ఆమె శరీరంలో 150 మిల్లీగ్రాముల వీర్యం లభించినట్లు వచ్చిన కథనాలను పోలీసులు ఖండిచారు. పోలీసులు తెలిపిన మరిన్ని వివరాలను ఈ కథనంలో తెలుసుకుందాం.

Kolkata Doctor Murder Case
Kolkata Doctor Murder Case (ANI)

By ETV Bharat Telugu Team

Published : Aug 17, 2024, 2:18 PM IST

Kolkata Doctor Murder Case :బంగాల్‌ హత్యాచార ఘటనలో ఇప్పటివరకు వెలుగులోకి వచ్చిన విషయాలను పోలీసులు తోసిపుచ్చుతున్నారు. ఈ మేరకు ఆ విషయాల స్పష్టతనిచ్చారు. మృతురాలి కటిభాగంలోని ఎముకలో పగుళ్లు వచ్చినట్లు సోషల్‌ మీడియాలో ప్రచారం జరుగుతోందని ఆ విషయంలో ఎటువంటి నిజం లేదన్నారు. మెజిస్ట్రేట్‌ ఎదుట చేసిన శవపరీక్షకు సంబంధించిన వీడియోలో ఎటువంటి ఫ్రాక్చర్‌ గురించిన వివరాలు ప్రస్తావించలేదని పోలీసులు స్పష్టం చేశారు.

సామాజిక మధ్యమంలో విస్తృతంగా తిరుగుతున్న మరో వార్త మృతురాలి శరీరంలో 150 మిల్లీగ్రాముల వీర్యం ఉందని, ఈ నేపథ్యంలో సాముహిక అత్యచారం జరిగినట్లు కథనాలు వెలువడ్డాయి. కోల్‌కతా హైకోర్టులో మృతురాలి కుటుంబం దాఖలు చేసిన పిటిషనే ఈ సమాచారానికి మూలమని పలు కథనాలు ఉటంకించాయి. ఈ వార్తలను పోలీసు ఉన్నతాధికారులు ఖండించారు. ఈ సమాచారం సామాజిక మధ్యమాల్లో విస్తృతంగా తిరగడంపై విస్మయం వ్యక్తం చేశారు. ఇటువంటి వార్తలను ప్రచారం చేసి ప్రజలను గందరగోళానికి గురిచేస్తున్నారని మండిపడ్డారు.

జూనియర్‌ డాక్టర్‌ మృతిని అసహజ మరణంగా నమోదు చేయడంపై పోలీసులు స్పష్టం చేశారు. ఈ కేసును అసహజ మరణం కింద నమోదు చేసి దానిని ఆత్మహత్య కింద మారుస్తున్నారని కొంతమంది తప్పుడు సమాచారన్ని వ్యాప్తి చేస్తున్నారని పోలీసులు తెలిపారు. ఆ మహిళ మృతిపై ఎవరు ఫిర్యాదు చేయని పక్షంలో ఈ కేసును అసహజ మరణంగా రికార్డు చేసినట్లు వెల్లడించారు. తక్షణ ఫిర్యాదు లేని కేసులను అసహజ మరణాలుగా నమోదు చేస్తారన్న పోలీసులు, శవపరీక్ష నివేదిక ఆధారంగా దాన్ని ఆత్మహత్య, హత్య, ప్రమాదవశాత్తుగా కేసు మార్చి విచారణ చేస్తామన్నారు. ఈ విషయాలను భారతీయ న్యాయ సంహిత సీఆర్‌పీసీ 174 వివరిస్తుందన్నారు.

సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోన్న కొన్ని పోస్టులు సహచర వైద్యుల్ని అనుమానితులుగా పేర్కొన్నాయి. ఆమె తల్లిదండ్రులు కొన్ని పేర్లతో కూడిన జాబితాను సీబీఐకు ఇచ్చినట్లు పేర్కొన్నాయి. ఒక్క వాలంటీర్‌ పేరు మినహా ఇప్పటివరకు ఏ ఏజెన్సీ కూడా ఇతర అనుమానితుల పేర్లను రికార్డుల్లో నమోదు చేయలేదని పోలీసుల స్పష్టం చేశారు. ఈ కేసులో పెద్ద వ్యక్తుల ప్రమేయం ఉన్నట్లు వస్తున్న వార్తలను తోసిపుచ్చారు.

వైద్యురాలిపై హత్యాచారం కేసు- ఇప్పటికే నాలుగు పెళ్లిళ్లు చేసుకున్న నిందితుడు! - Kolkata Doctor Murder Case

డాక్టర్ హత్యపై స్పందించిన మమతా బెనర్జీ- హంతకుడికి ఉరిశిక్ష పడే వరకు వదలబోం! - Kolkata Lady Doctor Murder Case

ABOUT THE AUTHOR

...view details