Karnataka Ex CM SM Krishna Death :కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్‌ఎం కృష్ణ (92) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మంగళవారం తెల్లవారుజామున బెంగళూరులోని సదాశివనగర్‌లో తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన స్వగ్రామం మద్దూరులోని సోమనహళ్లిలో బుధవారం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
ఎస్‌ఎం కృష్ణ మృతి నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం 3 రోజులు సంతాప దినాలుగా ప్రకటించింది. పూర్తి అధికారిక లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు తెలిపింది.
కర్ణాటక మాజీ సీఎం ఎస్‌ఎం కృష్ణ కన్నుమూత - ప్రముఖుల సంతాపం - KARNATAKA EX CM SM KRISHNA DEATH
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్‌ఎం కృష్ణ కన్నుమూత - సంతాపం తెలిపిన ప్రధాని మోదీ
Published : Dec 10, 2024, 7:24 AM IST
|Updated : Dec 10, 2024, 8:55 AM IST
ప్రధాని మోదీ సంతాపం
ఎస్‌ఎం కృష్ణ మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు. 'కృష్ణ ఒక అద్భుమైన నేత. అన్ని వర్గాల ప్రజల నుంచి అభిమానాన్ని అందుకున్నారు. తన జీవితాంతం ఇతరుల కోసం పాటు పడ్డారు. కర్ణాటక సీఎంగా అందించిన సేవలు ఎప్పటికీ గుర్తుంటాయి. ప్రత్యేకంగా మౌలిక సదుపాయల కల్పనపై ఆయన ఎక్కువ దృష్టి సారించారు. ఎస్‌ఎం కృష్ణలో గొప్ప పాఠకుడు, ఆలోచనాపరుడు ఉన్నారు' అని ఎక్స్ వేదికగా తెలిపారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు పలువురు నేతలు ఎస్‌ఎం కృష్ణ మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
కృష్ణ రాజకీయ ప్రస్థానం
- 1932 మే 1న జన్మించిన ఎస్‌ఎం కృష్ణకు భార్య ప్రేమ కృష్ణ; కుమార్తెలు శాంభవి, మాళవిక ఉన్నారు.
- మైసూరులోని మహారాజా కళాశాలలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన కృష్ణ యూనివర్సిటీ ఆఫ్ లా కాలేజీలో న్యాయ విద్యను అభ్యసించారు. ఆ తర్వాత అమెరికాలోనూ చదువుకున్న ఆయన రేణుకాచార్య లా కళాశాలలో ప్రొఫెసర్‌గా పని చేశారు.
- న్యాయవాది అయిన కృష్ణ 1962లో రాజకీయాల్లోకి ప్రవేశించారు. మద్దూరు స్థానం నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు.
- అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరారు. 1968లో లోక్‌సభ ఉప ఎన్నికల్లో మండ్య నుంచి పోటీ చేసి గెలుపొందారు. క్రమంగా కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా ఎదిగారు.
- 1989లో కర్ణాటక శాసనసభ స్పీకర్‌గా, 1992లో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా పని చేశారు.
- 1999లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన కృష్ణ 2024 వరకు కర్ణాటక ముఖ్యమంత్రిగా పని చేశారు.
- ఆ సమయంలో బెంగుళూరులో ఐటీ రంగం అభివృద్ధికి ఎంతో కృషి చేశారు. కర్ణాటకను సిలికాన్ సిటీగా మార్చడంలో కీలక పాత్ర పోషించారు.
- 2024 నుంచి 2028 వరకు మహారాష్ట్ర గవర్నర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు.
- 2009- 2012 మధ్య మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ హయాంలో విదేశాంగ శాఖ మంత్రిగా పని చేశారు.
- దాదాపు 50 ఏళ్లు కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎస్‌ఎం కృష్ణ, 2017లో బీజేపీలో చేరారు.
- 2023 జనవరి 7న వయసు దృష్ట్యా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు.
- 2023లో కేంద్ర ప్రభుత్వం ఆయన్ను పద్మవిభూషణ్ పురస్కారంతో సత్కరించింది.