Foldable Steel Glass :మారుతున్న కాలానికి అనుగుణంగా.. మార్కెట్‌లో ఎన్నో కొత్తకొత్త వస్తువులు దర్శనమిస్తున్నాయి. ఇవి చూడటానికి అందంగా ఉండటంతో పాటు.. అంతకుమించి ఉపయోగపడుతుంటాయి. వినియోగదారుల అభిరుచులకు తగ్గట్టుగా సంస్థలు వివిధ వస్తువులను తయారు చేస్తున్నాయి. ఇప్పుడు మనం ఈ స్టోరీలో.. కిచెన్‌లో వాడుకునే వస్తువులగురించి తెలుసుకుందాం. ఇవి మన అవసరాన్ని తీర్చడంతోపాటు ఎంతో సౌకర్యంగానూ ఉంటాయి!
ఈ గ్లాసు సూపర్!
మడతపెట్టే గ్లాసు (ETV Bharat) సాధారణంగా మనం ఇంట్లో.. టీ, మంచినీళ్లు, పాలు, జ్యూస్.. వంటివి తాగడానికి ఒక్కోదానికి ఒక్కో గ్లాసు ఉపయోగిస్తాం. అయితే, ఇప్పుడు మార్కెట్‌లో ఫోల్డబుల్ స్టెయిన్‌లెస్ స్టీల్ కప్‌లు ఎక్కువగా అమ్ముడుపోతున్నాయి! ఇవి ఏంటంటే.. సైజ్ అడ్జస్ట్ చేసుకుని మనం టీ, మంచినీళ్లు, పాలు, జ్యూస్ అన్నింటికీ వాడుకోవచ్చు. ఈ ఒక్క గ్లాస్ ఉంటే చాలు.. మూడు గ్లాసులు అవసరం లేదు! అంతేకాదు.. మనం దీనిని మడిచేసి ఎక్కడికైనా ప్రయాణాలూ, క్యాంపింగ్, అవుట్‌డోర్ యాక్టివిటీస్‌కి వెళ్లినప్పుడు వెంట తీసుకెళ్లొచ్చు. ఈ గ్లాస్ ఉంటే మనం బయట ఎక్కడైనా ప్లాస్టిక్ గ్లాసులను వాడాల్సిన అవసరం లేదు.
360 డిగ్రీస్ ప్లేట్ (ETV Bharat) ఇక నుంచి ప్లేట్ కింద పడదు!
చిన్న పిల్లలు వాళ్లంతట వాళ్లు తినడం అలవాటు చేసుకోవాలని.. మమ్మీలు ప్లేటులో ఆహారం పెట్టిస్తుంటారు. కానీ, చాలాసార్లు పిల్లలు ఫుడ్ కింద పడేసుకుంటుంటారు. పిల్లలు కావాలని చేయకపోయినా ఏదోక విధంగా అన్నం కింద పడుతుంటుంది. ఇలా ఆహారం వృథా కాకుండా ఉండడానికి ఓ మ్యాజిక్ బౌల్ మార్కెట్లోకి వచ్చింది. ఈ బౌల్ 360 డిగ్రీల కోణాల్లో తిరుగుతుంది. దీనివల్ల పిల్లలు ప్లేటుని పైకి, కిందకీ, పక్కకు, ఎటు తిప్పినా కూడా ఆహారం కింద పడదు. మీరు కూడా మీ పిల్లలకు ఫుడ్ ఈ ప్లేట్‌లో పెట్టి ఇస్తే సరి.. కిందపడడం అన్నదే జరగదు.
మూలల్లోనూ క్లీన్ చేయొచ్చు
గ్యాప్ క్లీనింగ్ బ్రష్ (ETV Bharat) సింక్‌లోని జల్లెడలోనూ, ట్యాప్ వెనక భాగంలోనూ, కౌంటర్‌టాప్ అంచుల్లోనూ జిడ్డు, మట్టి అంత ఈజీగా వదలదు. ఇలాంటి చోట క్లీన్ చేయడానికి మీకు 'గ్యాప్ క్లీనింగ్ బ్రష్' బాగా ఉపయోగపడుతుంది. ఫ్లాట్‌గా ఉండే దీనిని యూజ్ చేస్తూ ఎక్కడైనా సరే ఈజీగా శుభ్రం చేయొచ్చు. దీనికి ఉండే పీఈటీ బ్రసెల్స్‌తో మురికి త్వరగా పోతుంది. అలాగే దీనిని అవెన్, స్లైడింగ్ డోర్ రైల్స్, బాత్‌రూమ్.. వంటివి శుభ్రం చేసుకోవడానికి కూడా వాడుకోవచ్చు. ఇవండీ మార్కెట్‌లో కొత్తగా వచ్చిన కొన్ని వస్తువులు! నచ్చితే మీరు కూడా ఉపయోగించండి!
స్టీల్ పాత్రలు, గాజు, ప్లాస్టిక్ బాటిల్స్‌పై - స్టిక్కర్స్ ఎలా తొలగించాలో మీకు తెలుసా?
ఎంత తోమినా గిన్నెల మీద జిడ్డు పోవడం లేదా? - ఇలా చేస్తే చాలు చిటికెలో మాయం!