Five Pilgrims killed In Gujarat : గుజరాత్ ఈ తెల్లవారుజామున యాత్రికులతో వెళ్తున్న ప్రైవేట్ బస్సు అదుపు తప్పి లోయలో పడింది. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందగా, 35 మంది గాయపడ్డారు. ఈ ఘటన డాంగ్ జిల్లాలోని సపుతర హిల్ స్టేషన్ పరిధిలో జరిగింది.
లోయలో పడ్డ బస్సు- ఐదుగురు మృతి- 17మందికి తీవ్రగాయాలు - FIVE PILGRIMS KILLED IN GUJARAT
గుజరాత్‌లో ఘోర రోడ్డు ప్రమాదం- ఇద్దరు మహిళలు సహా ఐదుగురు మృతి
Published : Feb 2, 2025, 10:25 AM IST
|Updated : Feb 2, 2025, 12:14 PM IST
ఆదివారం తెల్లవారుజామున 4:15 గంటల సమయంలో సపుతర హిల్ స్టేషన్ పరిధిలో బస్సు అదుపుతప్పి 35 అడుగుల లోయలో పడింది. బ్రేక్‌లు ఫెయిల్ కావడం వల్లనే బస్సు అదుపుతప్పి లోయలో పడిందని పోలీసులు తెలిపారు. 'ఈ ఘటనలో డ్రైవర్ సహా ముగ్గురు పురుషులు, ఇద్దరు మహిళలు మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకొని క్షతగాత్రుల్ని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. 17 మంది తీవ్రంగా గాయపడగా, మిగతావారు స్వల్పగాయాలతో బయటపడ్డారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 48 మంది ప్రయాణికులు ఉన్నారు' అని పోలీసులు తెలిపారు. మహారాష్ట్రలోని త్రయంబకేశ్వర్ నుంచి గుజరాత్‌లోని ద్వారకకు వస్తుండంగా ఈ ప్రమాదం జరిగినట్లు పేర్కొన్నారు.
'యాత్రికులంతా మధ్యప్రదేశ్‌లోని గుణ, శివపురి, అశోక్ నగర్ జిల్లాలకు చెందినవారు. వీరంతా 2025 డిసెంబర్ 23న మన దేశంలోని వివిధ రాష్ట్రాల్లోని పుణ్యక్షేత్రాలను దర్శించుకునేందుకు 4 వేర్వేరు బస్సుల్లో బయలుదేశారు. వీటిలోని ఒక బస్సు ఆదివారం అదుపుతప్పి లోయలో పడిపోయింది. బ్రేక్ ఫెయిల్యూర్ వల్ల డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోయి ఉండవచ్చని ప్రాథమికంగా తెలుస్తోంది' అని డాంగ్ జిల్లా కలెక్టర్ మహేశ్ పటేల్ తెలిపారు.