తెలంగాణ

telangana

ETV Bharat / bharat

లోక్​సభ ఎన్నికల ఎగ్జిట్​ పోల్స్​- మూడోసారి మోదీయే! అన్ని సర్వేల్లో బీజేపీకే మెజార్టీ స్థానాలు!! - Lok Sabha Elections 2024

Lok Sabha Election 2024 Exit Polls : దేశంలో మరోసారి మోదీ ప్రభంజనం ఖాయమని మెజార్టీ సర్వే సంస్థలు అంచనా వేశాయి. గతంలో మాదిరిగానే దేశవ్యాప్తంగా మోదీ గాలి వీచిందని స్పష్టం చేశాయి. తమిళనాడు, కేరళలో ప్రతిపక్ష ఇండియా కూటమి దాదాపుగా క్లీన్‌ స్వీప్‌ చేస్తుందని సర్వే సంస్థలు వెల్లడించాయి. బీజేపీ అంచనాలకు తగ్గట్లే ఫలితాలు వస్తాయన్న సర్వే సంస్థలు ఇండియా కూటమి మరోసారి ప్రతిపక్ష పాత్రకే పరిమితం అవుతుందని వెల్లడించాయి. ఎన్‌డీఏ కూటమికి 350కుపైగా స్థానాలు వస్తాయని అంచనా వేసిన సంస్థలు ప్రతిపక్ష ఇండియా కూటమి 150 స్థానాల్లోపే పరిమితం అవుతుందని వివరించాయి.

Lok Sabha Election 2024 Exit Polls
Lok Sabha Election 2024 Exit Polls (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Jun 1, 2024, 6:02 PM IST

Updated : Jun 1, 2024, 10:18 PM IST

Lok Sabha Election 2024 Exit Polls: జూన్‌ 4వ తేదీ నాటి ప్రజాతీర్పు కోసం యావత్‌ దేశం ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. ఏడు దశల్లో జరిగిన ఎన్నికలు ముగిసిన వెంటనే సర్వే సంస్థలు 2024 ఎగ్జిట్‌ పోల్స్‌ను విడుదల చేశాయి. నేతల రాజకీయ భవిష్యత్తును నిర్ణయించే ఓట్ల లెక్కింపునకు మరో మూడు రోజులు సమయం ఉన్న వేళ దేశ ప్రజలను ఎగ్జిట్ పోల్స్ పలకరించాయి. 2024 సార్వత్రిక ఎన్నికల్లో దేశంలో ఎన్​డీఏదే మరోసారి అధికారం అని దాదాపు అన్ని సర్వే సంస్థలు ఘంటాపథంగా తేల్చిచెప్పాయి. సీట్ల సంఖ్యలో అంచనాలు వేరుగా ఉన్నప్పటికీ మరోసారి ప్రధాని మోదీనే అధికార పగ్గాలు చేపడతారని తేల్చిచెప్పాయి. ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలు చూసుకుంటే ఎన్​డీఏ కూటమికి కనిష్ఠంగా 242 సీట్లు, గరిష్ఠంగా 392 సీట్లు వస్తాయని వివిధ సర్వే సంస్థలు అంచనా వేశాయి.

ముడోసారి మోదీయే
సార్వత్రిక సమరంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏకి 350కుపైగా స్థానాలు వస్తాయని ఇండియా న్యూస్‌-డీ డైనమిక్స్‌ సర్వే సంస్థ వెల్లడించింది. బీజేపీకు 371కుపైగా స్థానాలు వస్తాయ, కాంగ్రెస్‌ 125 సీట్లు గెలుస్తుందని ఇతరులకు 47 స్థానాలు వస్తాయని అంచనా వేసింది. రిపబ్లిక్‌ భారత్‌ పీమార్క్‌ కూడా ఇదే రకమైన అంచనాలను వెలువరించింది. బీజేపీకు 359కుపైగా సీట్లు వస్తాయని, కాంగ్రెస్‌ పార్టీ 154 సీట్లకే పరిమితం అవుతుందని, ఇతరులకు 30 స్థానాలు దక్కుతాయని రిపబ్లిక్‌ భారత్‌ పీ మార్గ్‌ అంచనా వేసింది. రిపబ్లిక్‌ భారత్‌ మ్యాట్రిజ్‌ కూడా బీజేపీ గాలి బలంగా వీచిందని వెల్లడించింది. బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏకు 353 నుంచి 368 స్థానాలు వస్తాయని ప్రతిపక్ష ఇండియా కూటమికి కేవలం 118 నుంచి 133 స్థానాలే రావచ్చని తెలిపింది. ఇతరులకు 43 నుంచి 48 స్థానాలు వస్తాయని వెల్లడించింది.

జన్‌ కీ బాత్ సర్వే కూడా ఎన్​డీఏ కూటమికే పట్టం కట్టింది. కమలం పార్టీ నేతృత్వంలోని కూటమికి 362 నుంచి 392 స్థానాలు వస్తాయని తెలిపిన జన్‌కీబాత్‌ సర్వే ఇండియా కూటమికి 161 స్థానాలు దాటబోవని తేల్చి చెప్పింది. ఇతరులకు పది నుంచి 20 స్థానాలు వస్తాయని వెల్లడించాయి. న్యూస్‌ నేషన్‌ సర్వే కూడా కమలం పార్టీ వికసిస్తుందని అంచనా వేసింది. ఎన్‌డీఏకు 342 నుంచి 378 స్థానాలు వస్తాయన్న న్యూస్‌ నేషన్‌ సర్వే కాంగ్రెస్‌కు 153 నుంచి 169 స్థానాలు వస్తాయని తెలిపింది. ఇతరులకు 21 నుంచి 23 స్థానాలు దక్కుతాయని వివరించింది.

దైనిక్‌ భాస్కర్‌ ఎగ్జిట్‌పోల్‌ కూడా ఎన్‌డీఏనే అధికారం చేపడుతుందని తేల్చి చెప్పింది. ఎన్‌డీఏకు 281 నుంచి 350 స్థానాలు వస్తాయని చెప్పిన దైనిక్‌ భాస్కర్‌, కాంగ్రెస్‌ నేతృత్వంలోని ఇండియా కూటమికి 145 నుంచి 201 స్థానాలు వస్తాయని తెలిపింది. ఇతరులు 33 నుంచి 49 స్థానాల్లో గెలుస్తారని అంచనా వేసింది. ఇండియా టీవీ- సీఎన్‌ఎక్స్‌ కూడా దేశవ్యాప్తంగా బీజేపీ హవానే నడిచిందని అంచనా వేసింది. ఎన్డీఏ కూటమికి 371 నుంచి 401 స్థానాలు వస్తాయని, ఇండియా కూటమికి 109 నుంచి 139 స్థానాలు వస్తాయని తెలిపింది. ఇతరులకు 28 నుంచి 38 స్థానాలు వస్తాయని వెల్లడించింది

లోక్‌సభ ఎన్నికల ఎగ్జిట్ ఫలితాలు సంస్థల వారీగా

ఎన్​డీఏ ఇండియా ఇతరులు
ఇండియా న్యూస్‌-డీ డైనమిక్స్‌ 371 125 47
రిపబ్లిక్‌ భారత్‌-పీమార్క్‌ 359 154 30
రిపబ్లిక్‌ భారత్‌-మ్యాట్రిజ్‌ 353-368 118-133 43-48
జన్‌కీబాత్‌ 362-392 141-161 10-20
న్యూస్‌ నేషన్‌ 342-378 153-169 21-23
దైనిక్‌ భాస్కర్‌ 281-350 145-201 33-49
సీఎన్​ఎక్స్​ 371-401 109-139 28-38
న్యూస్​ 18 355-370 125-140 42-52
ఏబీపీ-సీ-ఓటర్​ 353-383 152-182 04-12
Last Updated : Jun 1, 2024, 10:18 PM IST

ABOUT THE AUTHOR

...view details