Easy Cleaning Tips For Water Tank :ఈరోజుల్లో దాదాపు అందరి ఇళ్లలోనూ గృహ అవసరాల కోసం ఇంటిపై వాటర్ ట్యాంకులు ఏర్పాటు చేసుకుంటున్నారు. అయితే.. చాలా మంది వాటర్ ట్యాంక్‌లో నీళ్లు ఉన్నాయా? లేవా? అని డైలీ మూత తీసి చూస్తుంటారు. కానీ, దాని శుభ్రత విషయం మాత్రం పెద్దగా పట్టించుకోరు. దాంతో.. అందులో నాచు, దుమ్ము, ధూళి పేరుకుపోయి అపరిశుభ్రంగా ఉంటుంది. అయినా.. చాలా రోజుల వరకు అలాగే వదిలేస్తారు!
దీనికి కారణం ఏమంటే.. వాటర్ ట్యాంక్ క్లీన్ చేయడం పెద్ద టాస్క్ అని భావిస్తారు. అందుకే.. ఎప్పుడో ఒకసారి ప్లంబర్‌ను పిలిచి.. ఎంతో కొంత డబ్బు చెల్లించి క్లీన్ చేయిస్తారు. అయితే.. ఈ టిప్స్ పాటిస్తే.. మీరే చాలా ఈజీగా వాటర్ ట్యాంక్‌ను(Water Tank) క్లీన్ చేసుకోవచ్చంటున్నారు నిపుణులు. ఇంతకీ, ఆ టిప్స్ ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
బ్లీచింగ్ పౌడర్ : వాటర్ ట్యాంక్‌ను శుభ్రం చేయడంలో బ్లీచింగ్ పౌడర్, లిక్విడ్ వంటివి చాలా బాగా ఉపయోగపడతాయంటున్నారు నిపుణులు. ఇందుకోసం ముందుగా వాటర్ ట్యాంక్‌ని ఖాళీ చేసి.. ట్యాంక్ అంతటా బ్లీచింగ్ పౌడర్ చల్లాలి. అలా ఒక గంటపాటు ఉంచి ఆపై బ్రష్, చీపురు లేదా స్క్రబ్బర్‌తో రుద్దుకోవాలి. తర్వాత మంచినీటితో కడుక్కోవాలి. అంతే.. ట్యాంకు దిగువన పేరుకుపోయిన నాచుతో పాటు దుమ్ము, ధూళి తొలగిపోయి ట్యాంకు కొత్తదానిలా కనిపిస్తుంది.
డిటర్జెంట్ పౌడర్ :బ్లీచింగ్ కాకుండా.. డిటర్జెంట్ పౌడర్‌తోనూ క్లీన్ చేయొచ్చు. బకెట్లో కొద్దిగా వాటర్ తీసుకొని అందులో డిటర్జెంట్ పౌడర్ వేసుకొని ద్రావణంలా ప్రిపేర్ చేసుకోవాలి. ఆపై ఆ లిక్విడ్ అప్లై చేస్తూ ట్యాంక్ గోడలను నైలాన్ బ్రష్ లేదా స్పాంజ్‌తో గట్టిగా రుద్దుకోవాలి. అయితే.. ట్యాంక్ దిగువకు వెళ్లడానికి పెద్ద హ్యాండిల్ ఉన్న బ్రష్ ఎంచుకోవడం బెటర్. ఆ తర్వాత మంచి నీటితో శుభ్రం చేసుకుంటే సరిపోతుందంటున్నారు నిపుణులు.
హైడ్రోజన్ పెరాక్సైడ్ :ఇది కూడా వాటర్ ట్యాంక్‌లో పేరుకుపోయిన నాచు, ఇతర క్రిమికీటకాలను తొలగించడంలో చాలా ఎఫెక్టివ్‌గా పనిచేస్తుందంటున్నారు నిపుణులు. ట్యాంక్ ఖాళీ చేసిన తర్వాత కొద్దిగా హైడ్రోజన్ పెరాక్సైడ్ పోయాలి. అలా ఓ అరగంటపాటు ఉంచి బ్రష్ లేదా స్పాంజితో రుద్ది మంచినీటితో శుభ్రం చేసుకోవాలి. చివరగా క్లాత్‌తో తుడుచుకొని కొద్దిసేపు ట్యాంకును ఆరబెట్టుకోవాలి. ఆ తర్వాత వాటర్ నింపుకొని వాడుకోవాలంటున్నారు నిపుణులు.