Cheese Rice Cutlet Recipe Making Process: అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు పెద్దలు. అందుకే.. అన్నాన్ని పడేయవద్దని చెబుతుంటారు. అయితే.. కొన్ని కారణాల వల్ల చాలా ఇళ్లలో రాత్రి పూట అన్నం మిగిలిపోతూ ఉంటుంది. పొద్దున ఆ అన్నం పెడితే.. చద్దన్నం మాకొద్దంటారు పిల్లలు. అన్నం పడేయాలంటే మనసుకు బాధ కలుగుతుంది. కొంత మంది పోపు చేస్తుంటారు. కానీ.. నిత్యం అదే అయితే తినడానికి ఇంట్రస్ట్ చూపించరు.
అందుకే.. మిగిలిపోయిన అన్నంతో కొన్ని రకాల స్నాక్స్ తయారు చేసుకోవచ్చు. అలాంటి వాటిలో చీజ్ రైస్ కట్లెట్ ఒకటి. ఇది పిల్లలకు చాలా నచ్చుతుంది. టమాట కెచప్, పుదీనా చట్నీ, మయోనెస్ వంటి వాటితో కలిపి వీటిని తింటే ఎంతో టేస్టీగా ఉంటుంది. ముఖ్యంగా.. సాయంత్రం పూట స్నాక్స్‌గా ఇది ఉపయోగపడుతుంది. మరి ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఈ స్టోరీలో చూద్దాం..
చీజ్ రైస్ కట్‌లెట్‌కు కావాల్సిన పదార్థాలు :
- అన్నం - 1 కప్పు
- ఉడికించిన మొక్కజొన్న గింజలు - అర కప్పు
- ఉప్మా రవ్వ - 2 టేబుల్ స్పూన్లు (దోరగా వేయించుకోవాలి)
- పసుపు - పావు టీ స్పూన్
- ఆయిల్ - 2 టేబుల్‌స్పూన్లు
- ఉల్లిగడ్డ - 1
- పచ్చిమిర్చి తరుగు - 1 టీస్పూన్
- అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 టీస్పూన్
- కారం - అర టీ స్పూన్
- ధనియాల పొడి - అర టీ స్పూన్
- చీజ్ - 100 గ్రాములు(తురుముకోవాలి)
- ఉప్పు - తగినంత