Boat Capsized In Jammu Kashmir : జమ్ముకశ్మీర్‌లోని జీలం నదిలో పడవ బోల్తా పడింది. శ్రీనగర్ సమీపంలోని గాంద్‌బల్ ప్రాంతంలో జరిగిన ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు. 10మంది గల్లంతయ్యారు. మరో ముగ్గురికి గాయాలయ్యాయి. గల్లంతైనవారి కోసం ప్రమాద స్థలంలో ఎస్‌డీఆర్‌ఎఫ్, పోలీసులు సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగిస్తున్నారు.
జీలం నదిలో పడవ బోల్తా - ఆరుగురు మృతి- 10మంది గల్లంతు - Boat Capsized In Jammu Kashmir - BOAT CAPSIZED IN JAMMU KASHMIR
Boat Capsized In Jammu Kashmir : జమ్ముకశ్మీర్‌లోని జీలం నదిలో పడవ బోల్తా పడింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందగా, మరో 10మంది గల్లంతయ్యారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న రెస్క్యూ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

Published : Apr 16, 2024, 10:10 AM IST
|Updated : Apr 16, 2024, 12:17 PM IST
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం, ఆ పడవలో పాఠశాల విద్యార్థులు సహా పలువురు ఉన్నారు. వారంతా గాంద్‌బల్ నుంచి బట్వారాకు వెళ్తున్నారు. ఈ ప్రమాదం నుంచి పలువురిని కాపాడారు. గల్లంతయిన వారి సంఖ్య తెలియాల్సి ఉంది. అయితే గత దశాబ్ద కాలంగా గాంద్బాల్ నుంచి శ్రీనగర్‌ను కలిపే వంతెన నిర్మాణం జరుగుతోందని, దీంతో ప్రజలు నదిని దాటాలంటే పడవలను ఆశ్రయించాల్సి వస్తోందని స్థానికులు తెలిపారు. ఈ వంతెనను నిర్మించి ఉంటే ఈ ప్రమాదం జరిగేది కాదని అన్నారు.
ఈ ఘటనపై జమ్ముకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. పడవలో ఉన్న వారందరూ సురక్షితంగా ఉండాలని తాను ఆశిస్తున్నానని, సహాయక చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు.
మరోవైపు గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు జమ్ముకశ్మీర్‌లోని చాలా ప్రాంతాలు జలమయమయ్యాయి. జీలం సహా పలు నదుల నీటి మట్టాలు పెరిగి ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. ఈ భారీ వర్షాలు కారణంగా కొండచరియలు విరిగిపడటం వల్ల సోమవారం జమ్మూ-శ్రీనగర్ హైవేను మూసివేశారు.