తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రూ.20 వేల స్కామ్- 38ఏళ్ల తర్వాత రిటైర్డ్ ఇంజినీర్ జైలుశిక్ష- విచారణలోనే ముగ్గురు నిందితులు మృతి! - Bihar 38 Years Old Scam Verdict

Bihar 38 Years Old Scam : 38 ఏళ్ల క్రితం జరిగిన కాలువ కాలువ మరమ్మతు పనుల కుంభకోణం కేసులో రిటైర్డ్ ఇంజినీర్​కు 4ఏళ్ల జైలు శిక్ష పడింది. అలాగే రూ.10వేల జరిమానాను విధించింది కోర్టు. అసలేంటి ఈ కుంభకోణం? ఎక్కడ జరిగింది? తదితర వివరాలు ఈ స్టోరీలో చూద్దాం.

By ETV Bharat Telugu Team

Published : Jun 29, 2024, 10:39 AM IST

Bihar 38 Years Old Scam
Bihar 38 Years Old Scam (Getty Images)

Bihar 38 Years Old Scam : కాలువ మరమ్మత్తు పనుల్లో రూ.20 వేలు విలువైన కుంభకోణానికి సంబంధించిన కేసులో 38ఏళ్ల తర్వాత ఓ రిటైర్డ్ ఇంజినీర్​కు 4ఏళ్ల జైలు శిక్ష పడింది. ఈ మేరకు బిహార్​లోని ముజఫర్​పుర్ స్పెషల్ మానిటరింగ్ కోర్టు ఈ తీర్పునిచ్చింది. దోషికి రూ.10 వేల జరిమానాను సైతం విధించింది. ఘోరసహన్ త్రివేణి కెనాల్ కుంభకోణం కేసులో ఈ తీర్పును ఇచ్చింది. దోషి జరిమానా చెల్లించని పక్షంలో జైలు శిక్షను పెంచనున్నట్లు తెలిపింది.

38ఏళ్ల కిందట ఆరోపణలు
బిహార్​లోని త్రివేణి కెనాల్ మరమ్మతుల్లో రూ.20 వేల కుంభకోణం జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. రూ.20,925 కుంభకోణం జరిగినట్లు వచ్చిన ఆరోపణలపై 1987 జూన్‌లో అప్పటి మానిటరింగ్ ఇన్‌స్పెక్టర్‌ అరుణ్‌ కుమార్‌ సింగ్‌ వినీత్‌ 13 ఏఫ్ఐఆర్​లను నమోదు చేశారు. ఈ కేసుపై విచారణ చేపట్టిన ముజఫర్ నగర్ స్పెషల్ మానిటరింగ్ కోర్టు, పట్నాకు చెందిన రిటైర్డ్ అసిస్టెంట్ ఇంజినీర్ (ఏఈ) సురేంద్రనాథ్ వర్మ (76)ను దోషిగా తేల్చింది. ఈ క్రమంలో అతడికి 4ఏళ్ల జైలు శిక్ష, రూ.10 వేల జరిమానా విధించింది.

త్రివేణి కెనాల్ మరమ్మతుల కుంభకోణం కేసులో అప్పటి ఏఈ సురేంద్రనాథ్ వర్మతో పాటు మరో ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ రామచంద్ర ప్రసాద్ సింగ్, అప్పటి జూనియర్ ఇంజినీర్ నావల్ కిషోర్ ప్రసాద్ సింగ్, కాంట్రాక్టర్ సమీఖాన్‌ను నిందితులుగా చేర్చారు. కాంట్రాక్టర్ సమీఖాన్ కేవలం రూ.1031కే పనులు చేసినట్లు విచారణలో తేలిందని స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ తెలిపారు. కానీ, లంచం తీసుకుని సమీఖాన్​కు ఇంజినీర్లు రూ.21,956కు కాంట్రాక్టును ఇచ్చారని పేర్కొన్నారు. ఈ క్రమంలో రూ.20,925 కుంభకోణం జరిగిందని వెల్లడించారు.

నిందితుల్లో ముగ్గురు మరణం
విచారణ అనంతరం మానిటరింగ్ బ్యూరో నలుగురు నిందితులపై చార్జ్ షీట్ దాఖలు చేసింది. విచారణ సమయంలో ముగ్గురు నిందితులు రామచంద్ర ప్రసాద్ సింగ్, నావల్ కిషోర్ ప్రసాద్ సింగ్, కాంట్రాక్టర్ సమీఖాన్ మరణించారు. కాగా ప్రస్తుతం బతికున్న అప్పటి అసిస్టెంట్ ఇంజనీర్‌ సురేంద్రనాథ్ వర్మకు జైలు శిక్ష పడింది. త్రివేణి కాలువ మరమ్మతుల సందర్భంగా 1986-87 ఆర్థిక సంవత్సరంలో ఈ కుంభకోణం జరిగింది. అప్పుడు సురేంద్రనాథ్ వర్మ తూర్పు చంపారన్‌ ఏఈగా పనిచేస్తున్నారు.

దిల్లీలో రికార్డ్ స్థాయి వర్షపాతం- 88ఏళ్లలో ఇదే తొలిసారి- చిన్నారులు సహా ఐదుగురు మృతి! - Delhi Heavy Rains

మమతా బెనర్జీపై గవర్నర్ బోస్​ పరువు నష్టం కేసు- అలా అన్నందుకే!

ABOUT THE AUTHOR

...view details