Best Tips to Make Lipstick Long Lasting:అమ్మాయిలు బ్యూటీగా కనిపించడంలో ఫేస్‌తో పాటు లిప్స్ కీలకం. దొండపండు లాంటి ఎర్రటి పెదాలు ఆడవాళ్ల అందాన్ని నిస్సందేహంగా రెట్టింపు చేస్తాయి. అయితే.. అయితే చాలా మందికి లిప్ స్టిక్ వేసుకోవడం సరిగా రాదు. ఏదైనా తినేటప్పుడు లేదా తాగేటప్పుడు తొలగిపోతుంది. దాంతో మళ్లీ అప్లై చేయాల్సి వస్తుంది. అలాకాకుండా.. మేము చెప్పే టిప్స్ ఫాలో అవుతూ లిప్‌స్టిక్ పెట్టుకున్నారంటే ఎక్కువ సేపు ఉండడంతో పాటు మీ అందాన్ని పెంచుతుంది. ఇంతకీ ఆ టిప్స్ ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం..
లిప్ స్క్రబ్: లిప్‌స్టిక్ ఎక్కువసేపు ఉండకపోవడానికి కారణం.. మీ పెదవులపై డెడ్ స్కిన్ సెల్స్ ఉండడం. ఇవి లిప్‌స్టిక్ తొందరగా పోయేలా చేస్తాయి. కాబట్టి ఎప్పుడైనా మీరు లిప్‌స్టిక్ పెట్టుకునే ముందు పెదాలను బాగా క్లీన్ చేయాలి. అంటే.. డెడ్ స్కిన్ సెల్స్ లేకుండా చూసుకోవాలి. ఇందుకోసం మీరు లిప్స్‌పై కొద్దిగా నూనె రాసి టూత్ బ్రష్‌తో సున్నితంగా స్క్రబ్ చేయండి. దాంతో డెడ్ స్కిన్ తొలగిపోతుందని నిపుణులు చెబుతున్నారు. ఆ తర్వాత పెదాలు కడిగి లిప్‌స్టిక్ పెట్టుకోండి. ఈ లిప్ స్క్రబ్ అనేది మీ పెదాల రూపాన్ని మెరుగుపరచడమే కాకుండా లిప్‌స్టిక్ బాగా అంటిపెట్టుకునేలా చేస్తుంది.
మాయిశ్చరైజ్ : లిప్‌స్టిక్ అప్లై చేయడానికి ముందు లిప్స్‌ను మాయిశ్చరైజ్ చేయండి. ఇది కూడా లిప్‌స్టిక్ తొందరగా పోకుండా ఉండడానికి సహాయపడుతుంది. ఇందుకోసం.. వాజిలెన్, లిప్ బామ్ పెదాలకు యూజ్ చేయండి. దీనివల్ల లిప్స్ పొడిబారకుండా చక్కగా కనిపిస్తాయి. దాంతోపాటు ఎక్కువసేపు ఉండే ఛాన్స్ ఉంటుందంటున్నారు నిపుణులు.