తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'100మందికి CCTV వీడియో చూపించిన బంగాల్​ గవర్నర్'- లైంగిక ఆరోపణలపై ఆనంద్​ బోస్​ రియాక్షన్ - BENGAL GOVERNOR MOLESTATION Issue

Bengal Governor Molestation Issue : తనపై వచ్చిన లైంగిక వేధింపులు ఆరోపణలపై బంగాల్​ గవర్నర్ సీవీ ఆనంద్​ బోస్​ తనదైన రీతిలో స్పందించారు. ఈ విషయానికి సంబంధించిన సీసీటీవి ఫుటేజీని 100మందికి చూపించారు.

Bengal Governor Molestation Issue
Bengal Governor Molestation Issue (ANI)

By ETV Bharat Telugu Team

Published : May 9, 2024, 9:29 AM IST

Updated : May 9, 2024, 12:52 PM IST

Bengal Governor Molestation Issue:బంగాల్‌ గవర్నర్‌ సీవీ ఆనంద్ బోస్‌పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణల ఆంశం కీలక మలుపు తిరిగింది. అన్నట్టుగానే, వేధింపుల అంశానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని 100మంది పౌరులకు చూపించారు ఆనంద్​ బోస్​. కోల్​కతాలోని రాజ్​భవన్​లో ఈ కార్యక్రమం గురువారం ఉదయం జరిగింది.

ఈ అంశానికి సంబంధించి రాజ్​భవన్​ బుధవారం కీలక ప్రకటన విడుదల చేసింది. దీనికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని 'రాజకీయ నాయకురాలు మమతా బెనర్జీ', 'ఆమె పోలీసులు'కు తప్ప 100మందికి చూపిస్తామని ప్రకటించింది. 'సీసీటీవీ ఫుటేజీని తమకు ఇవ్వడం లేదని పోలీసులు కల్పిత ఆరోపణలు చేశారు. వారిది చట్టవిరుద్ధమైన విచారణ. ఈ నేపథ్యంలో గవర్నర్​ ఆనంద్​ బోస్​ 'సచ్​ కే సామ్​నే' అనే కార్యక్రమాన్ని చేపట్టారు.' అని రాజ్​భవన్​ ఎక్స్​లో పోస్ట్​ చేసింది.

ఈ మేరకు రాజ్​భవన్​లో జరిగే కార్యక్రమానికి హాజరయ్యే కావాలనుకునే వారు ఈమెయిల్​ లేదా ఫోన్​ ద్వారా తమ అభ్యర్థనలు పంపాలని కోరింది. మొదటి 100 మంది వ్యక్తులకు మాత్రమే గురువారం ఉదయం రాజ్​భవన్​లో ఫుటేజీని చూడటానికి అనుమతి ఉంటుందని తెలిపింది. ఇదిలా ఉండగా, లైంగిక ఆరోపణలు నేపథ్యంలో సంబంధిత సీసీటీవీ ఫుటేజీని పంచుకోవాలని పోలీసులు రాజ్​భవన్​ను కోరారు. అయితే ఈ విషయంలో పోలీసులకు సహకరించవద్దని గవర్నర్ తన సిబ్బందిని ఆదేశించారు.

ఇదీ జరిగింది!
ఇటీవల బంగాల్​ గవర్నర్​ సీవీ ఆనంద్​ బోస్ తనను​ వేధింపులకు గురిచేశారంటూ ఓ మహిళ సంచలన ఆరోపణ చేసింది. కోల్​కతా రాజ్​భవన్​లో తాత్కాలిక సిబ్బందిగా పని చేస్తున్న మహిళ స్థానికంగా ఉన్న హరే స్ట్రీట్​ పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేసింది. ఉద్యోగం విషయమై గవర్నర్​ బోస్​ ఆ మహిళను రెండు సార్లు పిలిచినట్లు, ఆ సందర్భాల్లో వేధింపులకు గురిచేసినట్లు ఆరోపించింది. ఇక దీనిపై స్పందించేందుకు పోలీసులు ఆసక్తి చూపలేదు.

'సత్యం గెలుస్తుంది'
ఈ ఆరోపణలపై గవర్నర్​ సీవీ ఆనంద్​ బోస్​ స్పందించారు. సత్యం గెలుస్తందని అన్నారు. కల్పిత కథనాలను చూసి తాను ఎప్పుడూ భయపడనని చెప్పారు. 'ఇలా నన్ను కించపరచడం ద్వారా ఎన్నికల్లో ప్రయోజనం పొందాలని ఎవరైనా కోరుకుంటే, గాడ్​ బ్లెస్​ దెమ్. కానీ, బంగాల్​లో అవినీతి, హింసకు వ్యతిరేకంగా నా పోరాటాన్ని ఆపలేరు' అని బోస్​ చెప్పారు.

25మంది ఉగ్యోగులను తొలగించిన ఎయిర్​ఇండియా- అప్పటిలోగా విధుల్లో చేరాలని మిగతావారికి అల్టిమేటం! - Air India Cabin Crew Terminate

'ముస్లిం వ్యక్తికి భార్య ఉండగా సహజీవనం చేసే హక్కు లేదు'- హైకోర్టు కీలక వ్యాఖ్యలు - HC On Muslim Live In Relationship

Last Updated : May 9, 2024, 12:52 PM IST

ABOUT THE AUTHOR

...view details