Ayodhya Ram Mandir Specifications :అయోధ్య అంటే పరవశింపజేసే పురాణం. అయోధ్య అంటే చకితుల్ని చేసే చరిత్ర. అయోధ్య అంటే వెల్లివిరిసే వర్తమానం. అయోధ్య అంటే సాటిలేని మేటి భవ్యమైన భవిష్యత్తు. తరతరాలకు తరగని, చెరగని, చెదరని పెన్నిధి. అలాంటి అయోధ్యలో ఆవిష్కారమైన రాముని కోవెల, ప్రతి రామభక్తుడి హృదయసీమలో వెల్లివిరిసే సిరివెన్నెల. అయోధ్య శ్రీరామ దివ్యాలయం- అద్వితీయ, ఆధ్యాత్మిక, విశ్వచైతన్య స్వరూపం. అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడూ అయోధ్య రామమందిరం భారతీయ ఆర్ష ధర్మానికి గుండె చప్పుడు! ఈ నేపథ్యంలో అయోధ్య ఆలయానికి సంబంధించిన విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
161 అడుగుల ఎత్తులో ఆలయ నిర్మాణం
- నగర సంప్రదాయ శైలిలో అయోధ్యలోని శ్రీరాముడి ఆలయం నిర్మాణం
- ఉత్తరభారతంలో ఉన్న మూడు హిందూ వాస్తు శైలిల్లో ఇదీ ఒకటి. పశ్చిమ, తూర్పు భారత్‌లోనూ ఇటువంటి నిర్మాణాలు
- తూర్పు నుంచి పడమర దిక్కుకు 380 అడుగుల పొడవు, 250 అడుగుల వెడల్పు, 161 అడుగుల ఎత్తుతో ఆలయ నిర్మాణం
- గర్భగుడి వద్ద 40 కిలోల వెండితో పైకప్పు ఏర్పాటు
గర్భగుడిలో బాలరాముడి విగ్రహం
- రామాలయ గర్భగుడిలో 51 అంగుళాల పొడవైన బాలరాముడి విగ్రహం ప్రతిష్ఠాపన
- బాలరాముడి విగ్రహం పక్కన మత్స్య, కూర్మ, వరాహ, నారసింహ, వామన, పరశురామ, రామ, కృష్ణ, బుద్ధ, కల్కి అవతారాల విగ్రహాలు
- బాలరాముడి విగ్రహం పైభాగంలో ఓం, గణేశ, చక్రం, శంఖం, గద, స్వస్తిక్ గుర్తులు
- కమల నయనాలను పోలినట్లు బాలరాముడి కళ్లు
- బాలరాముడి విగ్రహం కింద భాగంలో ఒకవైపు హనుమ, మరొకవైపు గరుడ
3 అంతస్తుల్లో రామాలయ నిర్మాణం
- మూడు అంతస్తుల్లో రామాలయం నిర్మాణం. కాగా, ఒక్కో అంతస్తు ఎత్తు 20 అడుగులు.
- ఆలయంలో మొత్తంలో 392 స్తంభాలు, 44 గేట్లు.
- ఆలయ మొదటి అంతస్తులో శ్రీరామ దర్బార్.
- గుడిలో ప్రత్యేకంగా ఐదు మండపాలు. నృత్య, రంగ, సభా, ప్రార్థన, కీర్తనా మండపాలు ఏర్పాటు.
దివ్యాంగులు, వృద్ధుల కోసం ప్రత్యేకంగా లిఫ్టులు
- ఆలయ స్తంభాలు, గోడలపై దేవుళ్లు, దేవతామూర్తుల శిల్పాలు
- తూర్పు వైపున ఏర్పాటు చేసిన సింహ ద్వారం నుంచి ఆలయం లోపలికి ప్రవేశం
- దివ్యాంగులు, వృద్ధుల కోసం ప్రత్యేకంగా లిఫ్టులు, ర్యాంపులు
- ఆలయం చుట్టూ దీర్ఘచతురస్రాకారంలో 732 మీటర్ల పొడవైన గోడ. దీని వెడల్పు 14 అడుగులు
- ఆలయం 4మూలల సూర్య భగవానుడు, భగవతి, గణపతి, శివాలయం నిర్మాణం.
- ప్రధాన ఆలయానికి ఉత్తర భుజంలో శ్రీ అన్నపూర్ణ అమ్మవారి ఆలయం. దక్షిణ భుజంలో శ్రీ ఆంజనేయ స్వామి గుడి నిర్మాణం.
ఆలయ నిర్మాణంలో ఇనుప వాడలేదు
- ఆలయ సమీపంలో పురాణకాలం నాటి సీతాకూపం
- టెంపుల్ కాంప్లెక్స్‌లో వాల్మీకి, వశిష్ఠ, విశ్వామిత్ర, అగస్త్య మహర్షుల, నిశద్‌రాజ్, శబరి, దేవి అహల్య ఆలయాల నిర్మాణం
- నైరుతి భాగంలోని నవరత్న కుబేర్ తిలపై ఉన్న పురాతన శివుడి మందిరాన్ని పునరుద్ధణ. ఇక్కడే శ్రీ జటాయువు దేవతామూర్తి విగ్రహం ఏర్పాటు
- ఆలయం నిర్మాణంలో ఎక్కడ కూడా ఇనుము లోహాన్ని వాడలేదు
- ఆలయం కింద 14 మీటర్ల మందం కలిగిన రోలర్ కాంపాక్టు కాంక్రీట్(ఆర్‌సీసీ) వినియోగం
- భూమిలోని తేమ వల్ల ఆలయ నిర్మాణానికి ఇబ్బంది కలగకుండా రక్షణగా గ్రానైట్‌తో 21 అడుగుల ఎత్తైన పునాది
లగేజీని భద్రపరుచుకునేందుకు లాకర్లు
- ఆలయం కోసం ప్రత్యేకంగా ఓ విద్యుత్ సబ్ స్టేషన్
- భక్తుల సౌకర్యార్థం 25వేల మంది సామర్థ్యంతో ఉన్న ఓ ఫెసిలిటీ సెంటర్ ఏర్పాటు
- అయోధ్య రామయ్య దర్శనం కోసం వచ్చే భక్తులు లగేజీని భద్రపరుచుకునేందుకు ప్రత్యేక లాకర్లు
- మూత్రశాలలు, బాత్‌రూమ్‌లు, కుళాయిలు ఏర్పాటు
- 70 ఎకరాల విస్తీర్ణంలో చెట్లపెంపకం