Army JCO killed In JK Gun Fight :జమ్ముకశ్మీర్‌లోని కిష్ట్వార్ జిల్లాలో ఆదివారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్(జేసీఓ) మృతి చెందారు. మరో ముగ్గురు సైనికులు గాయపడ్డారు. దేశ రక్షణలో భాగంగా ప్రాణాలు అర్పించిన అమరవీరుడిని సెకండ్ పారా(స్పెషల్ ఫోర్సెన్స్) రెజిమెంట్ చెందిన నాయిబ్ సుబేదార్ రాకేశ్ కుమార్‌గా గుర్తించారు.
ఇటీవల ఇద్దరు విలేజ్ డిఫెన్స్ గార్డులను-వీడీజీ చంపిన ఉగ్రవాదుల కోసం చేపట్టిన ఆపరేషన్ కొనసాగుతోంది. ఈ క్రమంలో ఉదయం 11 గంటల సమయంలో కేశ్వాన్ అటవీ ప్రాంతంలో ఉగ్రవాదులు, ఆర్మీకి ఎదురుపడ్డారు. అనంతరం టెర్రరిస్ట్‌లు, సైనికులకు మధ్య కాల్పులు మొదలయ్యాయి. ఇద్దరు వీడీజీల మృతదేహాలు లభ్యమైన ప్రదేశానికి కొన్ని కిలోమీటర్ల దూరంలో ఈ కాల్పులు జరిగాయి.
ఉగ్రవాదుల ఉనికి గురించి సమాచారం అందుకోగానే భద్రతా దళాలు భార్త్ రిడ్జ్ ప్రాంతంలో సంయుక్త ఆపరేషన్ చేపట్టాయని వైట్ నైట్ కార్ప్స్ ఎక్స్‌లో తెలిపింది. ఇదే ఉగ్రవాదుల గ్రూప్ ఇటీవల ఇద్దరు గ్రామస్థుల(వీడీజీ) అపహరించి చంపేసిందని చెప్పింది. కాల్పులు జేసీఓ సహా మరో ముగ్గురు సైనికులు గాయపడ్డారని వారిని వెంటనే ఆస్పత్రి తరలించినట్లు వెల్లడించింది. అనంతరం అందులో ముగ్గురి పరిస్థితి విషమంగా మారిందని తెలిపింది. వారిలో జేఓసీ, పరిస్థితి మిషమించి ప్రాణాలు కోల్పోయారని చెప్పింది.
"వైట్ నైట్ కార్ప్స్ జనరల్ కమాండింగ్ ఆఫీసర్- జీఓసీ సహా అన్ని ర్యాంకుల అధికారులు సెకండ్ పారా(స్పెషల్ ఫోర్సెస్) నాయిబ్ సుబేదార్ రాకేశ్ కుమార్ చేసిన అత్యున్నత త్యాగానికి సెల్యూట్ చేస్తున్నారు. కిష్ట్వార్‌లోని భార్త్ రిడ్జ్‌లో కౌంటర్ ఇన్సర్జెన్సీ ఆపరేషన్ నాయిబ్ సుబేదార్ భాగం. ఈ బాధాకరమైన సమయంలో అమరవీరుడి కుటుంబంతో మేము ఉన్నాం." అని ఆర్మీ ట్వీట్ చేసింది.