AP PCC president Sharmila criticizes CM Jagan: ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల బాధ్యతలు స్వీకరించారు. అనంతరం మాట్లాడిని వైఎస్ షర్మిల వైఎస్సార్సీపీ, టీడీపీ బీజేపీలపై నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా దోచుకోవడం, దాచుకోవడమే ఉందని, రోడ్లు వేయడానికి, ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికి కూడా ప్రభుత్వం వద్ద డబ్బులు లేవని ఎద్దేవా చేశారు. మొత్తంగా రాష్ట్రంపై రూ. 10లక్షల కోట్లు అప్పులు ఉన్నాయన్నారు. జగన్‌రెడ్డి మూడు రాజధానుల పేరుతో ఒక్క రాజధాని కూడా కట్టలేదని షర్మిల విమర్శించారు.
రాష్ట్రంపై రూ.10 లక్షల కోట్లు అప్పులు: రాష్ట్రంలోని ప్రజల ఆకాంక్షల మేరకు వైఎస్సార్సీపీ. టీడీపీ పనిచేయడం లేదని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు రూ.2 లక్షల కోట్లు అప్పు చేస్తే, వైఎస్సార్సీపీ అధినేత జగన్ రూ.6.50 లక్షల కోట్లు అప్పు చేశారని ఆరోపించారు. మెుత్తంగా రాష్ట్రంపై రూ.10 లక్షల కోట్లు అప్పులు ఉన్నాయని, ఈ 10 ఏళ్లలో పది పరిశ్రమలైనా అంటూ ప్రశ్నించారు. రాష్ట్రంలో రోడ్లు వెయ్యడానికి, ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికి కూడా డబ్బులు లేవని, షర్మిల విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా దోచుకోవడం, దాచుకోవడమే అన్నట్లుగా తయారైందని షర్మిల ఆరోపించారు.
రాష్ట్ర ప్రభుత్వాలకు ఆర్‌బీఐ హెచ్చరిక - రుణం తీసుకునే సంస్థలపై పట్టు ఉండాలని సూచన
బీజేపీ చేతిలోనే ఎంపీలందరూ: కేంద్రంలో బీజేపీతో పొత్తులో ఉండికూడా చంద్రబాబు ప్రత్యేక హోదా తెలేకపోయారని విర్శించారు. ఇక ప్రతిపక్షంలో ఉండగా జగన్‌రెడ్డి ప్రత్యేక హోదా కోసం మూకుమ్మడి రాజీనామా చేస్తామన్నారని, కానీ జగన్‌రెడ్డి అధికారంలోకి వచ్చాక ఒక్కసారైనా ప్రత్యేక హోదాకోసం ఉద్యమం చేశారా అంటూ ప్రశ్నించారు. వైఎస్సార్సీపీ అయినా, టీడీపీ అయిన, ఎంపీలందరూ బీజేపీ తొత్తులే అంటూ వైఎస్ షర్మిల విమర్శలు గుప్పించారు. బీజేపీ ఏం చెప్తే దానికి రాష్ట్ర ఎంపీలు తలఊపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీ, టీడీపీలకు చెందిన ఎంపీలందరూ బీజేపీ చేతిలో ఉన్నారని ఆరోపించారు. బీజేపీ ప్రభుత్వం రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తానని హామీ ఇచ్చిందని, కానీ, బీజేపీ పాలనలో రైతులు అప్పులపాలయ్యారని షర్మిల విమర్శలు గుప్పించారు.
అమరావతిపై జగన్ సర్కార్ మరో కుట్ర! - మాస్టర్ ప్లాన్ను విచ్ఛిన్నం చేసే ప్రయత్నం