తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఆంధ్రా స్టైల్ "దొండకాయ రోటి పచ్చడి" - ఇలా చేస్తే అదిరిపోద్ది - వేడి వేడి అన్నంలో కేక! - Dondakaya Roti Pacchadi - DONDAKAYA ROTI PACCHADI

Dondakaya Chutney Recipe : వేడి వేడి అన్నంలోకి కమ్మని రోటి పచ్చడి ఉంటే.. ఒక రెండు ముద్దలు ఎక్కువే తింటాం. అయితే.. చాలా మంది టమాటాలతోనే రోటి పచ్చడి చేస్తుంటారు. కానీ, దొండకాయలతో ట్రై చేశారంటే.. ప్రతిసారీ ఇదే చేసుకుంటారు! మరి.. ఈ రెసిపీని ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం.

Dondakaya Chutney
Dondakaya Chutney Recipe (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Jul 19, 2024, 2:09 PM IST

Andhra Style Dondakaya Roti Pacchadi :మధ్యాహ్నం భోజనంలోకైనా.. రాత్రి చపాతీలలోకైనా.. కొంతమందికి సైడ్‌ డిష్‌గా రోటి పచ్చడి ఉండాల్సిందే! అయితే.. రోటి పచ్చడి అనగానే అందరికీ టమాటాలతో చేసిన పచ్చడి మాత్రమే గుర్తొస్తుంది. కానీ.. ప్రతిసారీ అదే తింటే రొటీన్ అయిపోతుంది. అందుకే మీకోసం ఈ సారి ఓ సరికొత్త రోటి పచ్చడి తెచ్చాం. అదే.. ఆంధ్ర స్టైల్‌ "దొండకాయ రోటి పచ్చడి". ఈ పచ్చడి చేశారంటే.. ఇంట్లో వాళ్లందరూ రోజూ తినేదానికంటే మరింత ఎక్కువగా అన్నం తినేస్తారు. అంత బాగుంటుందీ పచ్చడి. మరి.. ఈ దొండకాయ రోటి పచ్చడిని ఎలా ప్రిపేర్‌ చేయాలో ఇప్పుడు చూద్దాం.

కావాల్సిన పదార్ధాలు :

  • దొండకాయలు- పావు కేజీ
  • పచ్చిమిర్చి-15
  • చింతపండు- కొద్దిగా
  • నూనె- సరిపడినంత
  • కొత్తిమీర- సరిపడా
  • ఉప్పు- రుచికి సరిపడా
  • మెంతులు
  • ఆవాలు
  • మినపప్పు
  • శనగపప్పు
  • జీలకర్ర
  • కరివేపాకు-2 రెమ్మలు
  • ఎండుమిర్చి-2
  • ఇంగువ- అర టీస్పూన్‌

5 నిమిషాల్లో అద్భుతమైన టమాటా నువ్వుల పచ్చడి - వేడి వేడి అన్నంలో అమృతమే!

దొండకాయ పచ్చడి తయారీ విధానం :

  • ముందుగా పాన్‌లో కొద్దిగా ఆయిల్‌ వేసుకుని అందులో మెంతులు, ఆవాలు వేసి వేపుకోవాలి. మెంతులను ఎర్రగా వేపుకోవడం వల్ల పచ్చడి చేదుగా ఉండదు. కాబట్టి, ఎర్రగా వేపుకోండి.
  • తర్వాత టేబుల్‌స్పూన్‌ మినపప్పు, శనగపప్పు, జీలకర్ర కొద్దిగా, కరివేపాకు రెమ్మ ఒకటి వేసి ఫ్రై చేసుకోండి.
  • ఈ మిశ్రమం పూర్తిగా చల్లారిన తర్వాత.. రోట్లో వేసుకుని మెత్తగా నూరుకోవాలి.
  • తర్వాత అదే పాన్​లో కొద్దిగా ఆయిల్‌ వేసి చిన్నగా కట్‌ చేసుకున్న దొండకాయలు, పచ్చిమిర్చి వేసుకుని బాగా కలుపుకోండి. అలాగే మూత పెట్టి మగ్గించండి.
  • దొండకాయలు మగ్గిన తర్వాత కొద్దిగా చింత పండు వేసుకుని బాగా కలపండి. తర్వాత ఈ మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనివ్వండి.
  • ఈ ఫ్రై చేసుకున్న దొండకాయలను, ముందుగా సిద్ధం చేసుకున్న ఆవాలు, మెంతుల పేస్ట్‌ను రోటిలో వేసి మెత్తగా పేస్ట్‌ చేసుకోండి.
  • ఇప్పుడు తాలింపు కోసం ఒక గిన్నెలో ఆయిల్‌ వేసి ఆవాలు, జీలకర్ర, రెండు ఎండు మిర్చి, శనగపప్పు, మినపప్పు, ఇంగువ వేసి తాలింపుని మెత్తగా పేస్ట్‌ చేసుకున్న దొండకాయల మిశ్రమంలో వేసుకోండి.
  • తర్వాత పచ్చడిలో రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది.
  • అంతే ఇలా సింపుల్‌గా చేస్తే.. నోరూరించే దొండకాయ రోటి పచ్చడి రెడీ.
  • ఇంత ఈజీగా తయారైపోయే దొండకాయ రోటి పచ్చడిని మీరు కూడా తప్పకుండా ఓ సారి ట్రై చేయండి. ఇంటిల్లిపాదీ ఎంతో ఇష్టంగా ఆరగించండి.

ఇవి కూడా చదవండి :

అద్దిరిపోయే టమాటా రసం నిమిషాల్లో సిద్ధం - అన్నంలోకే కాదు సూప్​లా తాగేయొచ్చు!

నోరూరించే రొయ్యదోశలు.. తింటే వదలరు!

ABOUT THE AUTHOR

...view details