AAP MLA Gurpreet Gogi Shot Dead :లూథియానా వెస్ట్ ఎమ్మెల్యే, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేత గురుప్రీత్ గోగి శుక్రవారం రాత్రి బుల్లెట్ గాయాలతో అనుమానాస్పద స్థితిలో మరణించారు. అయితే 'శుక్రవారం రాత్రి గురుప్రీత్ పొరపాటున తనను తానే తలపై కాల్చుకున్నట్లు' ఆయన కుటుంబ సభ్యులు చెబుతున్నారని పోలీసులు తెలిపారు.
"శుక్రవారం సుమారు 12 గంటల సమయంలో గురుప్రీత్ గోగి ఇంట్లో కాల్పులు జరిగాయి. గురుప్రీత్ తలపై బుల్లెట్ గాయాలు కావడం వల్ల కుటుంబ సభ్యులు, ఆయనను ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే ఆయన మరణించినట్లు వైద్యులు తెలిపారు. కుటుంబ సభ్యులు మాత్రం, ప్రమాదవశాత్తు గురుప్రీత్ తనను తానే తుపాకీతో కాల్పుకున్నట్లు చెబుతున్నారు. ప్రస్తుతం మృతదేహాన్ని మార్చురీలో ఉంచారు. పోస్ట్మార్టం అయిన తరువాత మరణానికి గల అసలు కారణాలు స్పష్టంగా తెలిసే అవకాశం ఉంది. ప్రస్తుతం కేసు నమోదు చేసి ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నాం" అని లూథియానా డీసీపీ జస్కరణ్ సింగ్ తేజ పేర్కొన్నారు.
మరణానికి కొన్ని గంటల ముందు గురుప్రీత్ గోగి - విధాన సభ స్పీకర్ కుల్తార్ సింగ్ సంధ్వన్, ఆప్ ఎంపీ బల్బీర్ సింగ్ సీచెవాల్తో సమావేశమయ్యారు. ఇందులో 'బుద్ధ నల్ల' (బుధ వాగు)ను శుభ్రపరిచే అంశంపై చర్చించారు.