Prathidwani: కొవిడ్ కొనసాగుతుండగానే ఉద్ధృతమైన వైరల్ జ్వరాలు.. - Prathidwani debate on viral fevers
🎬 Watch Now: Feature Video
తెలుగు రాష్ట్రాల్లో కొవిడ్ బాధలు కొనసాగుతుండగానే... విష జ్వరాలు ముసురుకున్నాయి. జ్వరం, దగ్గు, జలుబు, ఒళ్లు నొప్పులు... ఒకే రకమైన ఈ వ్యాధి లక్షణాలు. కొవిడ్, డెంగ్యూ వ్యాధుల నిర్ధరణలో అస్పష్టతకు కారణమవుతున్నాయి. ఏది కొవిడ్, ఏది డెంగ్యూ జ్వరమో తెలుసుకునేలోపే వ్యాధులు ముదిరిపోతున్నాయి. సకాలంలో కచ్చితమైన వైద్యం లభించక ప్రజలు ప్రాణాపాయ స్థితికి చేరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కొవిడ్, విష జ్వరాల మధ్య వ్యత్యాసం తెలుసుకోవడం ఎలా? గ్రామీణ వైద్యులు, ప్రజలకు ఈ విష జ్వరాలపై ఎలాంటి అవగాహన కల్పించాలి? సకాలంలో సరైన వైద్యం అందాలంటే ఏం చేయాలనే అంశంపై ఈరోజు ప్రతిధ్వని.