కేసీఆర్ సంచలన నిర్ణయం అదేనా.. కేటీఆర్ మాటల్లోనే..! - telangana news
🎬 Watch Now: Feature Video
KTR on CM KCR Sensational Decision: రెండు మూడు నెలల్లో సంచలనం ఉంటుందని బెంగళూరు వేదికగా ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ప్రకటనపై మంత్రి కేటీఆర్ స్పందించారు. తినబోతూ రుచులు అడగొద్దని.. ఈ విషయంపై ముఖ్యమంత్రే సమాధానం చెబుతారని ఆయన వెల్లడించారు. ఎనిమిదేళ్ల తర్వాత తెలంగాణ అవతరణ దినోత్సవం కేంద్ర ప్రభుత్వానికి గుర్తుకు రావడం సంతోషకరమని కేటీఆర్ వ్యాఖ్యానించారు. గురువారం దిల్లీలో తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకల్లో పాల్గొనే కేంద్ర హోంమంత్రి అమిత్ షా... విభజనచట్టంలోని హామీల అమలుపై స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు.