రూ. ఐదున్నర కోట్ల కరెన్సీనోట్లతో అమ్మవారికి అలంకరణ - దేవి నవరాత్రుల స్పెషల్
🎬 Watch Now: Feature Video
దేవీ శరన్నవరాత్రుల ఉత్సవాలలో భాగంగా మహబూబ్‌గనర్ జిల్లా కేంద్రం బ్రాహ్మణవాడిలోని శ్రీవాసవి కన్యకా పరమేశ్వరి మాత ధనలక్ష్మి అవతార రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా అమ్మవారిని 5 కోట్ల 55 లక్షల 55వేల 555 రూపాయల, 55 పైసల రూపాయలతో ఆలయ కమిటీ నిర్వాహకులు అలంకరించారు. ధనలక్ష్మి రూపంలో దర్శనం ఇచ్చిన అమ్మవారిని జిల్లా కేంద్రంలోని భక్తులే కాకుండా, వివిధ ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి పూజలు నిర్వహించారు. భారీ ఎత్తున కురుస్తోన్న వర్షాన్ని సైతం లెక్కచేయకుండా వస్తున్న భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ నిర్వాహకులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు.