ఊళ్లో కొత్త బస్టాండ్ నిర్మాణం- ఓపెన్ చేసిన 'గేదె'! - protest for bus stand
🎬 Watch Now: Feature Video
గ్రామంలో నిర్మించిన కొత్త బస్టాండ్‌ను ఓ గేదె ప్రారంభించింది! వినడానికి విడ్డూరంగా ఉంది కదూ!! కానీ.. నిజమంటున్నారు కర్ణాటక గడగ్ జిల్లా బలేహోసూర్ గ్రామస్థులు. ఎంపీ, ఎమ్మెల్యే నిధులతోనే ఈ బస్టాండ్ కట్టించామని ఓ బ్యానర్ కూడా పెట్టారు. అసలు విషయానికొస్తే.. ప్రజాప్రతినిధుల వైఖరిపై నిరసనగా వారు ఇలా చేశారు. బస్టాండ్ కట్టించమని 15 ఏళ్లుగా కోరుతున్నా పట్టించుకోలేదని ధ్వజమెత్తారు. అందుకే కొబ్బరి మట్టలతో ఓ పందిరి వేసి.. ఇదే బస్టాండ్ అంటూ ఓ వెరైటీ ప్రారంభోత్సవం నిర్వహించారు.