ఫ్యాటీ లివర్ సైలెంట్ కిల్లర్.. గుర్తించకపోతే డేంజర్: డా.నాగేశ్వర్ రెడ్డి - AIG chiarman f2f
🎬 Watch Now: Feature Video
AIG Nageswar Reddy: ఉండాల్సిన దానికన్నా కాస్త ఎక్కువ బరువున్నా.. ఉన్నట్టుండి బరువు పెరిగినా... జీవన శైలిలో మార్పు వచ్చినా దాని ప్రభావం కాలేయంపై పడుతోంది. ఫలితంగా ఇటీవలి కాలంలో ఫ్యాటీ లివర్ బాధితుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఒకప్పుడు కేవలం మద్యం సేవించే వారికి మాత్రమే కాలేయ సమస్య వస్తుందని భావించే వారు అయితే ఇప్పుడు పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. ఎలాంటి చెడు వ్యసనాలు లేకపోయినా... జెనెటికల్ గాను, బరువు కారణంగాను ఫ్యాటీ లివర్ బాధితులు పెరుగుతున్నారు. ఈ నేపథ్యంలో ఫ్యాటీ లివర్ వల్ల కలిగే దుష్పరిణామాలు, తీసుకోవాల్సిన చర్యలపై ఏఐజీ ఆస్పత్రి ఛైర్మన్, ప్రముఖ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ నాగేశ్వర్ రెడ్డితో ఈటీవీ భారత్ ప్రతినిధి రమ్య ముఖముఖి.