తిరుమల బ్రహ్మోత్సవాలు: గజ వాహనంపై గోవిందుడి కటాక్షం - గజవాహనంపై తిరుమలేశుడి దర్శనం వార్తలు
🎬 Watch Now: Feature Video

శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరో రోజు రాత్రి స్వామివారికి గజవాహన సేవ నిర్వహించారు. సన్నిధి నుంచి తిరుచ్చీపై కల్యాణోత్సవ మండపానికి మలయప్పస్వామిని తీసుకొచ్చి.. గజవాహనంపై అధిరోహించారు. పండితుల వేదమంత్రాలు, మంగళవాయిద్యాల నడుమ అర్చకులు వైధిక కార్యక్రమాలను నిర్వహించారు. గురువారం సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు సర్వభూపాల వాహనంలో అమ్మవార్లతో కలసి స్వామివారు దర్శనమిచ్చారు. సాధారణంగా బ్రహ్మోత్సవాల్లో ఆరో రోజు స్వామివారికి బంగారు రథోత్సవం నిర్వహిస్తారు. కరోనా ప్రభావంతో ఉత్సవాలను ఆలయంలో ఏకాంతంగా నిర్వహిస్తున్నందున... రథోత్సవం సమయంలో ఆలయంలో ఏకాంతంగా సర్వభూపాల వాహన సేవను నిర్వహించారు.