ప్రతిధ్వని : వినియోగదారుల హక్కుల చట్టం ఏం చెబుతోంది?

🎬 Watch Now: Feature Video

thumbnail
వినియోగదారుల హక్కుల పరిరక్షణకు కేంద్రం తీసుకొచ్చిన కొత్త చట్టం అమల్లోకి వచ్చింది. 1986 నాటి వినియోగదారుల రక్షణ చట్టానికి మరింత పదును పెడుతూ.. 2019 చట్టాన్ని రూపొందించారు. ఈ కొత్త చట్టం ప్రకారం వినియోగదారుల ప్రాణాలతో చెలగాటమడే వ్యాపారులకు జైలు శిక్ష, జరిమానా విధిస్తారు. మోసపూరిత ప్రకటనలు ఇస్తే జైలు శిక్ష వేస్తారు. కల్తీ వస్తువులతో మరణానికి కారణమైతే జీవితఖైదు పడుతుంది. కొత్త చట్టం ఈ కామర్స్​ వినియోగదారులకు మరింత భద్రతను కల్పిస్తుంది. వినియోగదారుల వివాదాల పరిష్కారానికి జిల్లా, రాష్ట, జాతీయస్థాయిల్లో కమిషన్లు పని చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో వినియోగదారుల హక్కుల రక్షణ కోసం అమల్లోకి వచ్చిన కొత్త చట్టంలోని ప్రధాన అంశాలపై ప్రతిధ్వని చర్చను చేపట్టింది.
Last Updated : Jul 21, 2020, 10:02 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.