ప్రతిధ్వని: మనుషుల్లో ఈ క్రూరత్వమేంటి? బయట పడేదెలా?
🎬 Watch Now: Feature Video
ఏపీలోని చిత్తూరు జిల్లా మదనపల్లెలో రెండు రోజుల క్రితం జరిగిన ఓ దుస్సంఘటన మానవ మస్తిష్కాన్ని మెుద్దుబారేలా చేసింది. కనురెప్పలే కంటిపాపలను ఇంత కృురంగా చంపుతాయా? అని సభ్యసమాజం ఉలిక్కి పడింది. కన్నకూతుర్లను చంపిన తర్వాత కూడా ఆ తల్లిదండ్రుల్లో ఏ మాత్రం పశ్చాత్తాపం కనిపించకపోగా.. ఇప్పటికీ తమ కుమార్తెలు... దేవుడి దగ్గరకు వెళ్లారని.. తిరిగి వస్తారని నమ్ముతుండటం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. కేవలం ఈ ఒక్క సంఘటనే కాదు.. ఇలాంటి అనేక సంఘటనలు వివిధ రూపాల్లో.. వివిధ పేర్లతో.. తెలుగు రాష్ట్రాల్లో.. ఇతర చోట్ల జరుగుతూనే ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో.. ఇలాంటి దుస్సంఘటనల నుంచి సమాజం ఏ విధంగా బయటపడాలి అనే దానిపై ప్రతిధ్వని చర్చను చేపట్టింది.
Last Updated : Jan 27, 2021, 10:11 PM IST