అనంతలో కనువిందు చేస్తున్న బాహుబలి జలపాతం - బట్రేపల్లి తాజా వార్తలు
🎬 Watch Now: Feature Video

కరవుసీమ అనంత పర్యటకులను కనువిందు చేస్తోంది. తలుపుల మండలం బట్రేపల్లి జలపాతం చూపరులను చూపు తిప్పుకోనియకుండా పరవళ్లు తొక్కుతోంది. నాలుగైదు రోజులుగా కురుస్తున్న వర్షాలకు కొండ పైనుంచి జాలువారుతున్న జలధారలు జలపాతానికి మరిన్ని సొగసులద్దాయి. పర్యటకులు ప్రకృతి ఒడిలో సేద తీరేందుకు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. ఈ బాహుబలి జలపాతం ధారల్లో మునిగి తేలుతున్నారు.
TAGGED:
జలపాతం అందాలు తాజా వార్తలు