మద్యం మత్తులో గొడవ పడిన యువకులు- భయందోళనలో బస్తీవాసులు - Young People Fight in Alcohol
🎬 Watch Now: Feature Video


Published : Jan 15, 2024, 3:49 PM IST
Young People Fight at Sanathnagar Viral Video : పండగ వేళ మద్యం మత్తులో యువత చెలరేగిపోయారు. గ్రూపులుగా ఏర్పడి ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. కర్రలు, రాళ్లు ఆయుధాలుగా మారాయి. స్థానికులు ఎంత చెప్పినా వినిపించుకోకుండా మరింతగా రెచ్చిపోయి కొట్టుకున్నారు. దీంతో నగరవాసులు పోలీసులకు సమాచారం అందించడంతో వెంటనే వారు వచ్చి కొంత మంది యువకులను అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్‌లోని సనత్‌నగర్‌లో జరిగిన ఘటనలో పలువురు యువకులకు తీవ్రంగా గాయాలయ్యాయి.
Young People Godava at Sanatnagar Viral : పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం హైదరాబాద్‌లోని సనత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బోరబండ బస్టాండ్ దగ్గరలో హరినగర్, రామానగర్‌లో అర్ధరాత్రి యువకుల మధ్య గొడవ జరిగింది. వారందరూ మద్యం మత్తు(Youth Fight Video)లో ఉన్నారని గమనించిన స్థానికులు వారిని అదుపు చేసేందుకు ప్రయత్నించారు. వారి వినిపించుకోకుండా కర్రలు, రాళ్లతో చెలరేగిపోయారు. దీంతో కొంతమంది యువకులకు తీవ్రగాయాలయ్యాయి. వెంటనే బస్తీవాసులు చూసి 100 నంబర్‌కు ఫోన్ చేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని కొంత మంది యువకులను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. యువత గొడవ పడుతున్న వీడియోలు సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. దీంతో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.