ఉచిత ప్రయాణంతో ఆర్థికంగా ప్రయోజనం - మహాలక్ష్మి పథకంపై మహిళల ఆనందం - సీఎం రేవంత్‌రెడ్డిపై మహిళల స్పందన
🎬 Watch Now: Feature Video
Published : Dec 9, 2023, 4:04 PM IST
|Updated : Dec 9, 2023, 4:14 PM IST
Womans Response on Free Bus Service : రాష్ట్రంలో పల్లెవెలుగు, ఎక్స్ ప్రెస్ బస్సుల్లో ఉచితంగా ప్రయాణ సౌకర్యం కల్పించడంపై మహిళలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. పథకం ప్రారంభానికి ముందే మహిళలు ప్రయాణ ప్రాంగణాలకు చేరుకున్నారు. ఈ రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి మహిళలకు మహాలక్ష్మి పథకం అందుబాటులోకి వచ్చిందని ఇక నుంచి బస్సులో ఉచితంగా ప్రయాణం చేయవచ్చని అన్ని బస్టాండ్లలో ఆర్టీసీ అధికారులు మైకుల్లో చెప్పారు.
Mahalakshmi Scheme inaugurated in Telangana : డబ్బులు లేక గతంలో ఇబ్బందులు పడ్డామని ఇప్పుడు ప్రభుత్వ నిర్ణయంతో ఉచితంగా బస్సుల్లో ప్రయాణం చేస్తామంటున్న మహిళలు ఆనందం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మహిళలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుందన్నారు. గతంలో కుటుంబంలో కలిసి ప్రయాణాలు చేయాల్సివస్తే వేలలో ఖర్చు అయ్యేదని ఇప్పుడు మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించడంతో ఆర్థికంగా ఉపశమనం కలగనుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తమలాంటి పేదలకు ఎంతో ప్రయోజనకరమన్నారు.