Errabelli on Warangal Floods : వరంగల్, హనుమకొండ జిల్లాల్లో.. వరద నష్టం ఎన్ని కోట్లంటే
🎬 Watch Now: Feature Video
Errabelli Dayakar Rao on Flood Damage in Warangal : వరంగల్, హనుమకొండ జిల్లాల్లో వరదల నష్టంపై అధికారులు, ప్రజాప్రతినిధులతో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సమీక్ష నిర్వహించారు. దాదాపు వరద నష్టం రూ.414 కోట్లుగా ప్రాథమికంగా అంచనా వేసినట్లు ఎర్రబెల్లి తెలిపారు. వరదల్లో మృతిచెందినవారికి రూ.4 లక్షల పరిహారం అందించనున్నట్లు వెల్లడించారు. క్షతగాత్రులకు రూ.60,000 నుంచి రూ.2,00,000 వరకూ పరిహారం ఇవ్వనున్నట్లు వివరించారు. లోతట్టు కాలనీల నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు ఆయన పేర్కొన్నారు.
వరదల ఉద్ధృతికి 207 పూర్తిగానూ.. 480 ఇళ్లు పాక్షికంగానూ దెబ్బతిన్నట్లు తేలిందని ఎర్రబెల్లి దయాకర్‌రావు పేర్కొన్నారు. రహదారులు, కల్వర్టులు, కాలువలకు రూ.177 కోట్లకు పైగా నష్టం వాటిల్లిందని తెలిపారు. కేసీఆర్, కేటీఆర్ ఎప్పటికప్పుడు వరదలపై ఆరా తీశారని.. అడిగినన్ని బృందాలను పంపారని వివరించారు. అధికారులంతా బాగా కష్టపడ్డారని ప్రశంసించారు. అందుకు నిదర్శనమే గంటలోగానే భద్రకాళీ చెరువు గండి పూడ్చివేత అని ఉదహరించారు. ఈ క్రమంలోనే వ్యాధులు ప్రబలకుండా అందరూ జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వరదలు తగ్గాక పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆదేశించారు.