Villagers Protest Against Minister Malla Reddy : మంత్రి మల్లారెడ్డికి నిరసన సెగ.. ఆందోళనకు దిగిన గ్రామస్థులు - కాంగ్రెస్ నేతలు
🎬 Watch Now: Feature Video
Published : Sep 6, 2023, 5:39 PM IST
Villagers Protest Against Minister Malla Reddy : మంత్రి మల్లారెడ్డికి మరోసారి నిరసన సెగ ఎదురైంది. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని బొమ్మరాశిపేటలో పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి మల్లారెడ్డిపై గ్రామస్థులు విరుచుకుపడ్డారు. గ్రామంలో 380 మంది అర్హులైన వారందరికీ ఒకేసారి పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇప్పుడు కొంతమందికి తర్వాత కొంతమందికి ఇస్తామంటే ఊరుకునే ప్రసక్తే లేదని నిలదీశారు. అర్హులైన పేదలకు కాకుండా వేరే వాళ్లకు పట్టాలు పంపిణీ చేస్తున్నారని ఆరోపిస్తూ ఆందోళన చేశారు. 'గో బ్యాక్ మంత్రి మల్లారెడ్డి గో బ్యాక్' అంటూ నినాదాలకు దిగారు.
Double Bedroom House Pattas Program In Medchal : 2009 కాంగ్రెస్ హయాంలో బొమ్మరాశిపేట గ్రామస్థులకు 200 పట్టాలు ఇచ్చామని.. అవే పట్టాలను మంత్రి మల్లారెడ్డి అర్హులైన పేదలకు కాకుండా వేరే వాళ్లకు పంపిణీ చేస్తున్నారని పలువురు కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. డబుల్ బెడ్ రూమ్, గృహలక్ష్మి, దళిత బంధు పేర్లతో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలను మరోసారి మోసం చేస్తోందని విమర్శించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో.. స్థానిక కాంగ్రెస్ నేత హరివర్ధన్ రెడ్డిని అరెస్టు చేసి తీసుకెళ్తుండగా.. పోలీసు వాహనం ముందు బైఠాయించి మల్లారెడ్డి డౌన్ డౌన్ అంటూ కాంగ్రెస్ నేతలు నినాదాలు చేశారు. ఆందోళన చేస్తున్న వారిని అడ్డుకునే క్రమంలో పోలీసులకు, గ్రామస్థులకు మధ్య తోపులాటలు, వాగ్వాదాలు చోటు చేసుకున్నాయి. చివరికి 380 మంది అర్హులైన వారందరికీ ఒకేసారి వచ్చే మంగళవారం పట్టాలు ఇస్తానని హామీ ఇచ్చిన మంత్రి.. సమావేశం నుంచి వెళ్లిపోయారు.