Clash Between Villagers And Sarpanch : నిధుల్లో గోల్మాల్ చేశాడంటూ.. సర్పంచ్‌పై చెప్పుతో దాడి
🎬 Watch Now: Feature Video
Villagers and Sarpanch Fight in Mahabubabad : గ్రామ సభలో గ్రామంలో అభివృద్ధి కుంటుపడి మౌలిక వసతులు కరువయ్యాయని.. నిధుల గోల్మాల్ను ప్రశ్నించి సర్పంచ్‌పై చెప్పుతో దాడి చేసిన ఘటన మహబూబాబాద్ జిల్లా మొట్ల తండా గ్రామ పంచాయతీలో చోటుచేసుకుంది. గ్రామ పంచాయతీ కార్యాలయంలో గ్రామ సభ జరుగుతుండగా ఓ వ్యక్తి గ్రామంలో అభివృద్ధి పనులు జరగకుండానే బిల్లులను సర్పంచ్ కాజేశారని ఆరోపించి అశ్లీలపదాలతో దూషించి చెప్పుతో దాడి చేశారు. దీంతో గ్రామ సభలో గ్రామస్థులు, సర్పంచ్ వర్గీయుల మధ్య ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ వాగ్వాదం చోటుచేసుకుంది. గ్రామ కార్యదర్శి పరిస్థితులను అదపులోకి తెచ్చేందుకు గ్రామ సభను జూన్ 5వ తేదీకి వాయిదా వేసి సభను ముగించారు. పనులు చేయకుండానే సర్పంచ్ బిల్లులు ఎత్తుకుంటున్నారని గ్రామస్థులు ఆరోపించారు. ఈ విషయంపై సర్పంచ్ సుమన్ నాయక్‌ను వివరణ కోరగా.. గ్రామంలో చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక తనపై వ్యక్తిగత కక్షతోనే వర్రే మహేశ్ అనే వ్యక్తి దాడి చేశారని ఆరోపించారు. తనపై దాడి చేసిన మహేశ్‌పై చర్యలు తీసుకుని న్యాయం చేయాలని అధికారులను కోరారు.