Venkaiah Naidu Latest News : 'దేశ నాగరికత, కళ, సాహిత్య సంపదను భావితరాలకు అందించాలి'
🎬 Watch Now: Feature Video
Venkaiah Naidu Inaugurated Maha Vishnu Idol : బర్మాటేక్‌తో రూపొందించిన మహావిష్ణు శిల్పాన్ని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సికింద్రాబాద్‌లో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో వెంకయ్యనాయుడుతో పాటు చిత్రకారుడు గిరిధర్ గౌడ్, రూపకర్తలు చదలవాడ తిరుపతిరావు శ్రీనివాసరావు, ఆయన కుటుంబ సభ్యులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిత్రకారుడు గిరిధర్‌గౌడ్.. మహావిష్ణు రూపాన్ని చరిత్రాత్మకమైన శిల్పంగా తీర్చిదిద్దారని వెంకయ్యనాయుడు కొనియాడారు. మహా విష్ణువు పవళించిన సజీవ శిల్పంగా మలచడం గొప్ప ఆధ్యాత్మిక భావాన్ని కలిగించిందన్నారు. చదలవాడ తిరుపతిరావు శ్రీనివాసరావు కుటుంబీకులు చేసిన కృషి అభినందనీయమన్నారు.
కలలకు ఎల్లలు లేవనే విషయాన్ని చిత్రకారుడు రుజువు చేశారన్నారు. వ్యాపార దృక్పథంతో కాకుండా కళలను రక్షించుకోవాలనే గొప్ప సంకల్పంతో ఇలాంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం శుభ పరిణామమని అన్నారు. దేశ నాగరికత, కళ , సంగీత, సాహిత్య సంపదను కాపాడుకుంటూ భావితరాలకు అందించాలన్నారు. ఐదు సంవత్సరాల శ్రమ తర్వాత శిల్పం రూపు సంతరించుకుందని శిల్పకర్త చదలవాడ తిరుపతిరావు తెలిపారు. టేకు అరణ్యంలో లభించిన అరుదైన మహా వృక్షాన్ని వేలం పాటలో దక్కించుకొని అద్భుతమైన మహావిష్ణు రూపంగా మార్చామని వివరించారు.