ఉప్పల్ రింగ్ రోడ్డ్లోని హోమియోపతి క్లినిక్‌లో అగ్నిప్రమాదం - తప్పిన ప్రాణ నష్టం - హైదరాబాద్‌లో అగ్నిప్రమాదం న్యూస్
🎬 Watch Now: Feature Video
Published : Dec 26, 2023, 11:41 AM IST
Uppal Fire Accident Today : హైదరాబాద్ - వరంగల్ జాతీయ రహదారిలో ఉప్పల్ రింగ్ రోడ్ సమీపంలో ఉన్న హోమియోపతి క్లినిక్‌లో పొగలు రావడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే పోలీసులకు, అగ్నిమాపక శాఖ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఘటనాస్థలికి అగ్నిమాపక సిబ్బంది చేరుకుని అగ్ని మాపక యంత్రాలతో పొగలు, మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. క్రిస్మస్ సందర్భంగా ఆసుపత్రి మూసి ఉంచడంతో ప్రాణ నష్టం తప్పింది.
Fire Accident In Hyderabad : భవనంలో కింద మరో ఐ క్లినిక్ ఉంది. దానికి ఎలాంటి మంటలు వ్యాపించకపోవడంతో ప్రమాదం తప్పింది. ప్రధాన రహదారికి ఆనుకొని ఉన్న భవనంలో క్షణాల్లోనే దట్టమైన పొగలు వ్యాపించడంతో అటుగా వెళ్లే వాహనదారులు భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటనలో ఎవరికీ ఏం జరగకపోవడంతో అక్కడున్న వారంతా ఊపిరి పిల్చుకున్నారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఘటన ఎలా జరిగిందన్న విషయంపై ఆరా తీస్తున్నట్లు చెప్పారు.