Live video on Car Accident At LB Nagar : డ్రైవర్​ నిర్లక్ష్యం.. కారు డోర్​ తగిలి రెండేళ్ల చిన్నారి మృతి - కారు ప్రమాదంలో రెండేళ్ల బాలిక మృతి

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jun 2, 2023, 3:39 PM IST

Updated : Jun 2, 2023, 6:35 PM IST

two year girl died in car accident at Hyderabad : ఓ డ్రైవర్​ నిర్లక్ష్యానికి రెండేళ్ల పాప మృతి చెందింది. నాన్న బైక్​పై సరాదాగా బయటకు తీసుకుపోతుంటే.. వెనుక సీటులో అమ్మ ఒడిలో బోసు నవ్వులతో హాయిగా ఆడుకుంటోంది ఆ చిన్నారి. ముసిముసి నవ్వులతో ఉన్న ఆ చిన్ని తల్లిని ఇంతలో మృత్యువు కారుడోర్​ రూపంలో పలకరించింది. చుపరులను కంటతడి పెట్టించే ఈ ఘటన హైదరాబాద్​లోని ఎల్బీనగర్​లో చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. మన్సూరాబాద్​ నుంచి సుష్మా వైపు వెళ్తున్న ఓ కారు రోడ్డు పక్కన ఆపారు. ఈ క్రమంలో కారు డ్రైవర్​ నిర్లక్ష్యంగా బయటకు చూసుకోకుండా డోర్​ తీశారు. ఇదే సమయంలో వెనుక నుంచి శశిరేఖ, సయ్యద్​ వాళ్ల రెండేళ్ల పాప బైక్​పై వస్తున్నారు. ఈ సమయంలో కారు డోర్​ ఓపెన్​ కావడంతో చిన్నారి ధనలక్ష్మీకి బలంగా తాకింది. తీవ్ర గాయాలతో పాప అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటనకు సంబంధించి దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు కాగా.. ప్రమాదం జరిగిన వెంటనే కారు డ్రైవర్​ అక్కడి నుంచి పరారయ్యాడు.

Last Updated : Jun 2, 2023, 6:35 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.