Two Workers Stuck in Vaagu Viral Video : అకస్మాత్తుగా వరద.. వాగు మధ్యలో చిక్కుకున్న ఇద్దరు కూలీలు.. చివరకు..! - కూలీల కోసం రెండు గంటల పాటు శ్రమించిన యంత్రాంగం
🎬 Watch Now: Feature Video
Published : Sep 3, 2023, 10:31 PM IST
|Updated : Sep 3, 2023, 10:43 PM IST
Two Workers Stuck in Vaagu Viral Video : ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం తరోడా వద్ద భారీ వర్షానికి వాగు ఉప్పొంగింది. తాత్కాలిక వంతెన నిర్మాణ పనుల్లో నిమగ్నమైన ఇద్దరు కూలీలు.. అకస్మాత్తుగా వచ్చిన వరదలో చిక్కుకున్నారు. వారిని కాపాడేందుకు పోలీసులు, గజ ఈతగాళ్లు, స్థానికులు రెండు గంటల పాటుశ్రమించాల్సి వచ్చింది. తరోడా వాగుపై నిర్మించిన వంతెనకు పగుళ్లు తేలడంతో రాకపోకలు నిలిపేశారు.
వర్షాలు తగ్గుముఖం పట్టడంతో స్థానిక ఎమ్మెల్యే జోగు రామన్న ఆదేశాల మేరకు.. వాగుపై తాత్కాలిక వంతెన నిర్మాణ పనులు(Temporary Bridge Construction Works) ప్రారంభించారు. కూలీలు వంతెన పనుల్లో ఉండగా.. ఎగువన కుండపోత వర్షంతో అకస్మాత్తుగా వరద వచ్చింది. కూలీలను తొలుత తాడు సాయంతో బయటకు లాగేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ఘటనా స్థలానికి సీఐ నరేందర్ చేరుకుని.. గజ ఈతగాళ్లకు లైఫ్ జాకెట్లు, రక్షణ ట్యూబ్ ఇచ్చి కూలీలను బయటకు తీయాలని పురామయించారు. వారు వాగు మధ్యలో చిక్కుకున్న ఇద్దరిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. కూలీలను కాపాడిన గజ ఈతగాళ్లను పోలీసులు, స్థానికులు అభినందించారు.