Tomato Van Accident Hanamkonda : 'కూరగాయల వ్యాన్ బోల్తా పడిందట.. టమాటాలు తెచ్చుకుందాం పదండి' - Tomato vehicle overturned in Hanamkond
🎬 Watch Now: Feature Video
Tomato vehicle overturned in Hanamkonda : అల్‌టైం రికార్డు స్థాయికి పెరిగిన టమాటా ధరలు.. ప్రస్తుతం సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. టమాటాల అమ్మకానికి బాడీగార్డులను నియమించుకోవడం.. పుట్టినరోజు వేడుకల్లో టమాటాలను బహుకరించిన వార్తలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారుతున్నాయి. టమాటాలను రవాణా చేస్తున్న వాహనాల బోల్తా పడిన ఘటనలు చర్చనీయాంశంగా మారుతున్నాయి.
హనుమకొండ జిల్లాలో టమాటాలు, ఇతర కూరగాయల లోడ్‌తో వెళ్తున్న వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటన ఈరోజు ఉదయం ఆత్మకూరు శివారులో 163వ జాతీయ రహదారిపై జరిగింది. ఈ ప్రమాదంలో డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. టమాటాలతో పాటు మిగిలిన కూరగాయలు పూర్తిగా కింద పడిపోవడంతో డ్రైవర్ వెంటనే మరో వాహనం కోసం ఫోన్ చేశారు. వాహనం బోల్తాతో కింద పడిన టమాటాలను ఎవరు తీసుకెళ్లకుండా డ్రైవర్ ఘటనాస్థలంలో కాపలాగా ఉన్నారు. మరో వాహనం వచ్చి అందులో వాటిని తరలించిన అనంతరం వెళ్లిపోయారు. ఆ తర్వాత అక్కడ కొద్ది మొత్తంలో ఉండిపోయిన టమాటాలను అటుగా వెళ్తున్న వాహనదారులతో పాటు పక్కనే పొలంలో ఉన్న రైతులు తీసుకెళ్లారు.