Tomato Prices More High : టమాట రికార్డుల మీద రికార్డులు.. భైంసాలో కిలో@200 - నిర్మల్ టమాట వార్తలు
🎬 Watch Now: Feature Video
Tomato Prices High In Nirmal : టమాటా ధరలు ఆకాశాన్ని తాకడంతో సామన్యులు బెంబెలెత్తిపోతున్నారు. నిర్మల్ జిల్లా భైంసా మార్కెట్‌లో కిలో టమాటా ధర రూ. 200 పలుకుతోంది. మొన్నటి వరకు 120 రూపాయలు పలికిన ధర గత రెండు రోజుల నుంచి డబుల్ సెంచరీని దాటి దూసుకుపోతోంది. ఇది సామాన్యులకు కలవర పెట్టడమే కాదు. వ్యాపారులకు సైతం ఆందోళనను కలిగిస్తుంది. కనీస అమ్మకాలు జరగక వ్యాపారం డీలా పడుతుందని కూరగాయల వ్యాపారులు కలత చెందుతున్నారు. గతంలో ఒక టమాట బాక్సు రూ. 200 నుంచి రూ. 300 వరకు ఉండేది. ఇపుడు అదే బాక్సు రూ. 3500 నుంచి రూ.4500 ధర పలుకుతుంది. మార్కెట్‌లో రోజుకు 10 కిలోలు కూడా అమ్మడం లేదని స్థానిక వ్యాపారులు వాపోతున్నారు. టమాటాలు ఉంచడం వల్ల వేరే కూరగాయల గిరాకీ పెరుగుతుందని ఉంచడమే తప్ప అందులో లాభం లేదని అంటున్నారు. నష్టాలోన్నే అమ్ముతున్నామని.. గతంలో రోజుకు 5నుంచి 10 ట్రేలు టమాటాలు అమ్మేవారమని ఇప్పుడు ఒక్క ట్రే కూడా సరిగ్గా కొనేవారు లేరని వ్యాపారులు ఆవేదన చెందుతున్నారు.