Technical Problem in Telangana PGT Gurukul Exam : సర్వర్‌లో సాంకేతిక సమస్య.. ప్రారంభం కాని పీజీటీ గురుకుల పరీక్ష - పీజీటీ గురుకుల ఆన్‌లైన్ పరీక్షలో సాంకేతిక సమస్య
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/21-08-2023/640-480-19317378-thumbnail-16x9-technical-problem-in-telangana-pgt-gurukul-exam.jpg)
Technical Problem in Telangana PGT Gurukul Exam 2023 : తెలంగాణ పీజీటీ గురుకుల ఆన్‌లైన్ పరీక్ష నిర్వహణలో సాంకేతిక సమస్య తలెత్తింది. సర్వర్‌లో సమస్యతో రాష్ట్రవ్యాప్తంగా ఉదయం 8:30 గంటలకు ప్రారంభం కావాల్సిన ఇవాళ్టి ఇంగ్లీష్ ఎగ్జామ్.. 10 గంటలకూ ప్రారంభం కాలేదు. అభ్యర్థులను లోనికి అనుమతించకపోవడంతో సెంటర్‌ల ఎదుటే ఎదురు చూస్తున్నారు. సర్వర్‌లో సాంకేతిక సమస్య కారణంగానే ఎగ్జామ్ ఆలస్యమైనట్లు పరీక్ష కేంద్రాల నిర్వాహకులు చెబుతున్నారు. మరోవైపు పరీక్ష కోసం అభ్యర్థులు భారీగా కేంద్రాలకు చేరుకున్నారు. పరీక్ష స్టార్ట్ కాకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్‌లోని పరీక్షా కేంద్రం ఎదుట అభ్యర్థులు ఆందోళనకు దిగారు. దీంతో హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై ట్రాఫిక్ సమస్య ఏర్పడింది. విషయం తెలుసుకున్న పోలీసులు అభ్యర్థులతో మాట్లాడి.. వారిని శాంతింపజేశారు. ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు. అయితే ఇప్పటికే పరీక్ష ఆలస్యమైందని.. ఇదేరోజు 12 గంటల 30 నిమిషాలకు, 4 గంటల 30 నిమిషాలకు ఆన్‌లైన్ పరీక్షలు ఉన్నాయని అభ్యర్థుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.