కాంగ్రెస్తో పొత్తుకు ఫుల్స్టాప్ - స్వతంత్రంగానే 19 స్థానాల్లో పోటీ : తమ్మినేని - Tammineni on CPM Congress Alliance
🎬 Watch Now: Feature Video
Published : Nov 8, 2023, 12:04 PM IST
Tammineni on CPM Congress Alliance : తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీతో చర్చలకు పుల్ స్టాప్ పెట్టామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం స్పష్టం చేశారు. అఖిల భారతీయ స్థాయిలో సోనియా గాంధీ సీపీఎం అగ్ర నాయకులతో సంప్రదించి ఓ ప్రతిపాదన రాష్ట్ర నేతలకు పంపించిందని తెలిపారు. సీపీఐకి ఇచ్చినట్లు ఒక ఎమ్మెల్యే, రెండు ఎమ్మెల్సీలు ఇస్తామని చెప్పారని.. తమకు అదే విధంగా సీట్లు కేటాయిస్తే బావుంటుందని ప్రతిపాదన పంపారు.
No Alliance Of CPM Congress in Telangana : ఈ ప్రతిపాదనపై తమ నేతలతో చర్చించి ఓ నిర్ణయానికి వచ్చినట్లు తమ్మినేని తెలిపారు. ఈ క్రమంలోనే తమకు అత్యంత బలమున్న ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి సీటు ఇవ్వకుంటే.. కాంగ్రెస్కు సంపూర్ణ మద్దతు ఇవ్వలేమనే నిర్ణయానికి వచ్చినట్లు వెల్లడించారు. కేంద్రం పంపిన ప్రతిపాదనను నాయకులతో చర్చించి, తిరస్కరించినట్లు తమ్మినేని స్పష్టం చేశారు. రాష్ట్రంలోనే సీపీఎం పార్టీకి బలం ఉన్నటువంటి ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి స్వతంత్రంగా పోటీకి వెళ్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో ప్రస్తుతం 19 స్థానాల్లో సీపీఎం పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తోందని వివరించారు.