Sand Dunes in Crop Lands Karimnagar : పంట భూముల్లో ఇసుక మేటలు.. దిక్కుతోచని స్థితిలో అన్నదాతలు
🎬 Watch Now: Feature Video
Sand dunes in Crop Lands in Karimnagar : కరీంనగర్ జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలకు.. వాగులు, వంకలు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. అంచనాకు మించిన వరద ప్రవాహంతో రామడుగు, గంగాధర మండలాల్లోని వందలాది ఎకరాల పంట భూముల్లో ఇసుక మేటలు వేసింది. దీని వల్ల పంటలు సాగు చేయలేని దుస్థితి నెలకొందని.. అన్నదాతలు వాపోతున్నారు. రామడుగు మండలంలోని మోతె వాగు పైన నిర్మించిన.. ఆరు చెక్ డ్యాంలు గత సంవత్సరం వరదల్లో కొట్టుకుపోయాయి. దీంతో సమీపంలోని పంట భూములు కోతకు గురయ్యాయి. వందలాది ఎకరాల పంట భూముల్లో ఇసుక మేటలు వేసింది. రైతులు లక్షలాది రూపాయలు వెచ్చించి ఇసుక మేటలు తొలగించారు. ఈసారి కూడా మళ్లీ ఇసుక మేటలు వేయడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. గంగాధర మండలంలోని వరద ప్రభావిత గ్రామాలైన నారాయణ పూర్, గంగాధర, నాగిరెడ్డిపూర్, లక్ష్మీదేవిపల్లి గ్రామాల్లోని పంట భూముల్లో ఇసుక చేరడంతో పంటలు సాగు చేయలేని పరిస్థితి నెలకొందని అన్నదాతలు వాపోతున్నారు. వరద ముంపు సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని అన్నదాతలు కోరుతున్నారు.