థియేటర్లలో సలార్ అభిమానుల సందడి - ఫ్యాన్స్‌తో కిక్కిరిసిపోయిన సంధ్య థియేటర్ - సాలార్ సినిమా అభిమానుల సంబరాలు
🎬 Watch Now: Feature Video
Published : Dec 22, 2023, 5:42 PM IST
Salaar Prabhas Fans Crazy at Hyderabad : రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సలార్ సినిమా సందడి , ఆర్టీసీ క్రాస్ రోడ్డులో తారాస్థాయికి చేరింది. ఆర్టీసీ క్రాస్ రోడ్‌లోని సంధ్య 70 ఎంఎం సినిమా థియేటర్లో హీరో ప్రభాస్ సలార్ సినిమాను ప్రదర్శించారు. ఈ నేపథ్యంలో అభిమానుల ఉత్సాహానికి హద్దులు లేకుండా పోయింది. నిన్న అర్ధరాత్రి నుంచి ఆర్టీసీ క్రాస్ రోడ్‌లోని సంధ్య థియేటర్లో అభిమానుల కోలాహలంతో పరిసర ప్రాంతమంతా సందడిగా మారిపోయింది.
Salaar Movie Fans Celebration at Sandhya Theatre : సినిమా అభిమానుల కోసం అర్ధరాత్రి నుంచి ప్రత్యేక షోలను ఏర్పాటు చేశారు. దీంతో ఆర్టీసీ క్రాస్ రోడ్ వద్ద అభిమానులతో కళకళలాడింది. సినిమా థియేటర్ ఆవరణలో హీరో ప్రభాస్ అభిమానులు ఆయన చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. బాణాసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. అభిమానుల తోపులాట మధ్య ఆర్టీసీ క్రాస్ రోడ్‌లోని స్టీల్ బ్రిడ్జి పక్కనే ఏర్పాటు చేసిన బారికేడ్లు విరిగాయి.