Rahul Gandhi Chitchat With Tea Shop Old Age People : టీకొట్టులో రాహుల్ ప్రత్యక్షం.. వృద్ధ దంపతులతో చిట్​చాట్ - కాంగ్రెస్ నేత రాహుల్ తాజా వైరల్ న్యూస్

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telangana Team

Published : Oct 20, 2023, 5:54 PM IST

Rahul Gandhi Chitchat With Tea Shop Old Age People : తెలంగాణలో పర్యటిస్తున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ.. ఇవాళ మధ్యాహ్నం టీ కొట్టు సెంటర్‌లో ఆగి సందడి చేశారు. విజయభేరీ బస్సు యాత్రలో భాగంగా చివరి రోజు ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్‌లో పర్యటిస్తున్న రాహుల్.. మధ్యాహ్నం ఆర్మూర్ బయలుదేరారు. మార్గమధ్యలో పడగల్ వద్ద ఓ టీ కొట్టు వద్ద ఆగి.. అందరినీ ఆశ్చర్యపరిచారు. టీ అమ్ముకుంటున్న వృద్ధ దంపతుల సమస్యలను రాహుల్ గాంధీ స్వయంగా అడిగి తెలుసుకున్నారు.

Rahul Gandhi Latest Viral News : టీకొట్టు యజమాని కుటుంబంలోని చిన్నారులతో సరదాగా సంభాషించిన రాహుల్.. చిన్నారులకు చాక్లెట్లు పంచిపెట్టారు. సోనియమ్మ కొడుకు.. ఇందిరమ్మ మనుమడు నువ్వేనా అంటూ రాహుల్​ను అక్కడ వృద్ధ దంపతులు ఆప్యాయంగా పలకరించారు. టీ కొట్టు వృద్ధదంపతులతో మాట్లాడిన రాహుల్‌.. వారి ఆదాయం, ఖర్చుల గురించి అడిగి తెలుసుకున్నారు. ఊహించని విధంగా కాంగ్రెస్‌ అగ్రనేత తమ మధ్య ప్రత్యక్షమవటంతో స్థానికులు ఉబ్బితబ్బిబయ్యారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.