మా వీధిలో మద్యం షాపు నెలకొల్పవద్దంటూ వ్యాపారుల ఆందోళన - కరీంనగర్ లిక్కర్ న్యూస్
🎬 Watch Now: Feature Video
Published : Dec 8, 2023, 5:14 PM IST
Public Protest Against Liquor Shops At Karimnagar : మద్యం దుకాణంలో నెలకొల్పవద్దంటూ కరీంనగర్లో వ్యాపారులు రోడ్డు ఎక్కారు. గాంధీ రోడ్డులో షాపింగ్‌మాల్స్ పెద్ద మొత్తంలో ఉన్నాయి. జిల్లా నుంచి మహిళలు పెద్ద ఎత్తున ప్రతిరోజు వేల సంఖ్యలో గాంధీ రోడ్డుకు వస్తుంటారు. గాంధీ రోడ్డులో చీరలు తక్కువ ధరలో లభిస్తాయని మహిళలు చీరలను కొనుగోలు చేసేందుకు వస్తుంటారు. ఒకవేళ మద్యం షాపును నెలకొల్పితే వ్యాపారం మీద జీవనం కొనసాగిస్తున్న వారు రోడ్డున పడే అవకాశాలు ఉన్నాయని, వస్త్ర వ్యాపారులు రోడ్డుపై బైఠాయించి పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. అసోసియేషన్ కార్యదర్శి అశోక్ ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.
Public Protest Against Liquor In Karimnagar : మద్యం షాపును వద్దంటూ పెద్ద ఎత్తున మహిళలు, వ్యాపారులు నినాదాలు చేశారు. దాదాపు మూడు గంటల పాటు నిరసన జరగగా పోలీసులు చేరుకొని ఆందోళనను విరమింప చేశారు. మద్యం షాపులను నెలకొల్ప వద్దంటూ ఇప్పటికే జిల్లా కలెక్టర్ ఎక్సైజ్ అధికారికి వినతి పత్రం ఇచ్చామని వ్యాపారులు పేర్కొన్నారు. ఇప్పటికైనా మద్యం షాపు ప్రతిపాదనను విరమించుకోకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు.