Protest Against MLA Saidireddy Suryapet : 'నేను పనిచేయకపోతే అడగండి.. కానీ ఇలా రోడ్లెక్కి ధర్నాలొద్దు' - ఎమ్మెల్యే సైదిరెడ్డికి రైతుల నిరసన తెగ
🎬 Watch Now: Feature Video
Published : Oct 3, 2023, 12:49 PM IST
Protest Against MLA Saidireddy Suryapet : సూర్యాపేట జిల్లా నేరేడుచెర్ల మండలం దిర్శించెర్ల సబ్ స్టేషన్ వద్ద ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డికి నిరసన సెగ తగిలింది. ఓ కార్యక్రమం నుంచి తిరిగి వస్తున్న ఎమ్మెల్యేను రైతులు అడ్డుకుని.. తమ గ్రామంలో విద్యుత్ సమస్యలు ఉన్నాయంటూ గోడు వెళ్లబోసుకున్నారు. విద్యుత్ సరిపోక పంటలు ఎండిపోతున్నాయని వాపోయారు.
Farmers Protest against MLA Saidireddy : రైతుల సమస్య విన్న ఎమ్మెల్యే అప్పటికప్పుడు.. అక్కడికక్కడే విద్యుత్ అధికారులతో ఫోన్లో మాట్లాడి సమస్య పరిష్కారానికి ప్రయత్నించారు. రైతుబీమా, రైతు బంధు లాంటి పథకాలు అమలు చేసిన ప్రభుత్వం కేసీఆర్‌ది అని.. కాంగ్రెస్ మాటలు విని ఇలా ధర్నాలకు దిగడం సరికాదని ఎమ్మెల్యే హితవు పలికారు. 'ఏమైనా సమస్య ఉంటే నా దగ్గరకి తీసుకురండి.. నేను పని చేయకుంటే అప్పుడు నన్ను అడగండి, అంతేగాని రోడ్డు మీద ధర్నా చేయడం సరికాదు' అని సైదిరెడ్డి అన్నారు. ఓ రైతు మూడు గంటలు కూడా కరెంట్ రావడం లేదని అనడంతో.. అతడిపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేస్తూ రైతులకు కేసీఆర్ ప్రభుత్వం చేస్తున్న మేలు దేశంలో ఎక్కడా జరగడం లేదని సర్దిచెప్పారు.