Protest Against BRS Leader PadmaRao in Secunderabad : పద్మారావు గౌడ్​కు అడుగడుగునా నిరసన సెగ.. నియోజకవర్గంలో అడుపెట్టనివ్వని ప్రజలు - hyderabad latest news

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telangana Team

Published : Oct 27, 2023, 2:45 PM IST

Protest Against BRS Leader PadmaRao in Secunderabad : తెలంగాణ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ నాయకులు తమ తమ నియోజకవర్గాలలో ప్రచారాలు నిర్వహిస్తున్నారు.ఇందులో భాగంగా సికింద్రాబాద్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారానికి వెళ్లిన డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్​​కు చేదు అనుభవం ఎదురైంది. తార్నాక డివిజన్ మానికేశ్వర్ ​నగర్​లో బీఆర్ఎస్ పాదయాత్ర చేస్తున్న పద్మారావు గౌడ్​కు వ్యతిరేకంగా..  'గో బ్యాక్ పద్మారావు' అంటూ స్థానికులు  నినాదాలు చేశారు. హామీలు నెరవేర్చకుండా పద్మారావు గౌడ్ మానికేశ్వర్​నగర్​లో అడుగు పెట్టనివ్వమని స్థానికులు నిరసన తెలియజేశారు.  

గత 50 సంవత్సరాలుగా మానికేశ్వర్ నగర్​లో నివాసం ఉంటున్నా.. ఇక్కడ కనీస ఆసుపత్రి సదుపాయం లేదని స్థానికులు చెబుతున్నారు. వంద పడకల ఆసుపత్రి నిర్మాణానికై 160 రోజులు దీక్షలు చేపడితే స్థానిక ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ ఆస్పత్రి నిర్మాణానికి హామీ ఇచ్చి.. దీక్షను విరమింప చేశారని.. కానీ ఆ తర్వాత దాని ఊసే ఎత్తలేదని వాపోయారు.  పలుమార్లు పద్మారావును కలిసి ఆసుపత్రి గురించి మాట్లాడటానికి వెళ్తే చులకన చేస్తూ మాట్లాడడం చాలా బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. హామీలు నెరవేర్చిన తర్వాతే మానికేశ్వర్ నగర్​లో ఆయణ్ను అడుగుపెట్టనిస్తామని స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.