'నియంతపాలన అంతమొందించాలంటే సమిష్టి కృషి అవసరం'

🎬 Watch Now: Feature Video

thumbnail

Prof Kodandaram Fires on KCR : దోపిడీ పాలన అంతమొందాలంటే మార్పు అవసరమని.. కేసీఆర్​ను సాగనంపే సమయం వచ్చిందని తెలంగాణ జన సమితి రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ప్రజలకు సంబంధించిన ఎన్నో సమస్యల కోసం పోరాటం చేశామని.. కానీ ఈ ప్రభుత్వం ప్రజా సమస్యలను పట్టించుకోవడం లేదన్నారు. కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌ నియోజకవర్గంలో ఆయన ఇవాళ పర్యటించారు.

తెలంగాణ జన సమితి ముఖ్య కార్యకర్తలు ఏర్పాటు చేసిన సమావేశానికి ఆయనతో పాటు హుజూరాబాద్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి వొడితల ప్రణవ్‌ హాజరయ్యారు. కార్యకర్తలు వారికి ఘన స్వాగతం పలికారు. కేసీఆర్ నియంతృత్వానికి.. ప్రజల ప్రజాస్వామ్య ఆకాంక్షలకు మధ్య జరుగుతున్న యుద్ధంగా ఈ ఎన్నికలను కోదండరాం అభివర్ణించారు. నియంతపాలన అంతమొందించాలంటే సమిష్టి కృషి అవసరమని ఆచార్య కోదండరాం తెలిపారు. రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో పర్యటిస్తామని.. కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేస్తామని ఆచార్య కోదండరాం స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. సాధారణ ఎన్నికలో ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.