అన్నిరంగాల్లోనూ తమదైన ముద్ర వేస్తున్న మహిళలు - మహిళా రిజర్వేషన్ బిల్లు ఎంత వరకు అమలు అయింది
🎬 Watch Now: Feature Video
Published : Nov 25, 2023, 8:53 PM IST
Prathidwani on Telangana Elections 2023 : సరిగ్గా 2 నెలల క్రితమే లోక్‌సభ, రాష్ట్రాల శాసనసభల్లో మహిళలకు 3వ వంతు రిజర్వేషన్ కల్పించే చారిత్రక బిల్లుకు పూర్తిస్థాయి ఆమోదం తెలిపింది పార్లమెంట్. డీలిమిటేషన్ తర్వాత 2039 నుంచి ఈ కోటా అమల్లోకి వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ఐతే ఈ నినాదం సాకారం చేయడం కోసం పోరాడిన రాజకీయ పార్టీలన్నీ ప్రస్తుత 5 రాష్ట్రాల ఎన్నికల్లో ఆ స్ఫూర్తిని ఎంత వరకు నిలబెట్టుకున్నాయి?
Womens Reservation Bill Importance : తెలంగాణలోని 2వేల మంది పైగా అభ్యర్థుల్లోనూ.. మహిళా అభ్యర్థులకు దక్కిన స్థానాలు పదవ వంతు మాత్రమే. ఉన్న మహిళా అభ్యర్థులు అత్యధికులు స్వతంత్రులే ఉన్నారు. అన్నిరంగాల్లోనూ తమదైన ముద్ర వేస్తున్న మహిళలు తర్వాత చట్ట ప్రకారం వాళ్లకు ఇవ్వాల్సిన సీట్ల సంగతి సరే.. పార్టీలు అంతర్గతంగా ఎంతమేరకు ఈ అంశానికి ప్రాధాన్యత ఇస్తున్నాయి? రాజకీయ ప్రాతినిధ్యంలో న్యాయం లేనిచోట మహిళా సాధికార స్వప్నం సాకారాన్ని ఆశించగలమా? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.