prathidwani: ప్రభుత్వాలపై వ్యక్తులు అవిశ్వాసం ప్రకటించడం నేరమా? - రాజద్రోహం చట్టంపై ప్రతిధ్వని
🎬 Watch Now: Feature Video
Pratidwani: వివాదాస్పద రాజద్రోహం చట్టానికి సుప్రీంకోర్టు ధర్మాసనం బ్రేక్ వేసింది. తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకు సెక్షన్ 124-ఏ అమలును నిలిపివేస్తూ ఆదేశాలిచ్చింది. ఈ చట్టంలోని అంశాలను పరిశీలిస్తామని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. ఈ మేరకు సమీక్ష పూర్తయ్యేంత వరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ సెక్షన్ పరిధిలో విచారణలు, అప్పీళ్లు, అభియోగాల నమోదును ఆపేయాలని ధర్మాసనం ఉత్తర్వులిచ్చింది. బ్రిటిష్ పాలకులు స్వాతంత్య్రోద్యమాన్ని అణిచివేసేందుకు తీసుకొచ్చిన నల్లచట్టాన్ని ఇప్పటికీ మన ప్రభుత్వాలు అమలు చేయడం ఎంతవరకు సమంజసం? ఇప్పటికే ఆరెస్టై జైళ్లలో మగ్గుతున్న వారికి సుప్రీం తీర్పుతో ఎలాంటి ఊరట లభిస్తుంది? ఇదే అంశంపై ఈ రోజు ప్రతిధ్వని.
Last Updated : Feb 3, 2023, 8:23 PM IST