కామారెడ్డిలో రేవంత్ రెడ్డి గెలుస్తాడనే భయంతో పోలీసుల దాడులు : ఇందుప్రియ - కామారెడ్డిలో రేవంత్ రెడ్డి మీటింగ్
🎬 Watch Now: Feature Video
Published : Nov 28, 2023, 12:41 PM IST
Police Searches In Kamareddy Congress Leader House : కామారెడ్డి నియోజకవర్గంలో బీఆర్ఎస్ అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్, కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బరిలో ఉండటంతో ఇక్కడి రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. గత అర్ధరాత్రి కామారెడ్డికి చెందిన మున్సిపల్ వైస్ ఛైర్పర్సన్, కాంగ్రెస్ నేత గడ్డం ఇందుప్రియ చంద్రశేఖర్ ఇంటివ వద్ద హైడ్రామా చోటు చేసుకుంది. ఇటీవలే ఇందుప్రియ బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్లో చేరారు. దీంతో ఆమె ఇంట్లో భారీగా నగదు దాచారనే ఫిర్యాదుతో పోలీసులు, కేంద్ర బలగాలతో సోదాలు నిర్వహించారు.
ఈ క్రమంలో పోలీసులు, కాంగ్రెస్ శ్రేణులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. తమ ఇంట్లో మహిళా పోలీసులు లేకుండా సోదాలు చేయడంపై ఇందుప్రియ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నాయకులను భయబ్రాంతులకు గురిచేయాలనే బీఆర్ఎస్ దాడులు చేపిస్తుందని అన్నారు. కామారెడ్డిలో రేవంత్ రెడ్డికి వస్తున్న మద్దతు చూసి ఎక్కడ కేసీఆర్ ఓడిపోతారోనని భయం బీఆర్ఎస్ నాయకులకు పట్టుకుందని.. అందుకే పోలీసులని పంపి దాడులు చేస్తున్నారని శ్రీనివాస్ రావు పేర్కొన్నారు.